Video: 225 స్ట్రైక్‌రేట్‌తో 11 ఫోర్లు, 5 సిక్సులు.. ఎడారిలో ధోని స్నేహితుడి తుఫాన్ ఇన్నింగ్స్.. దెబ్బకు బౌలర్ ఎకానమీ ఢమాల్..

|

Mar 15, 2023 | 10:59 AM

ఓవైపు IPL 2023కి రంగం సిద్ధమైంది. దీని కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని టీంలు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక నెట్స్‌లో ధోని భారీ సిక్సర్లు కొడుతున్న వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Video: 225 స్ట్రైక్‌రేట్‌తో 11 ఫోర్లు, 5 సిక్సులు.. ఎడారిలో ధోని స్నేహితుడి తుఫాన్ ఇన్నింగ్స్.. దెబ్బకు బౌలర్ ఎకానమీ ఢమాల్..
Robin Uthappa Viral Video
Follow us on

ఓవైపు IPL 2023కి రంగం సిద్ధమైంది. దీని కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని టీంలు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక నెట్స్‌లో ధోని భారీ సిక్సర్లు కొడుతున్న వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మరోవైపు లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ధోని స్నేహితుడు కూడా బీభత్సమైన ఇన్నింగ్స్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. అందు క్రికెట్ ‘ప్రొఫెసర్’గా పేరుగాంచిన పాక్ బౌలర్‌పై భీకరమైన దాడి చేసి, వాహ్ అనిపించుకున్నాడు.

మార్చి 14 సాయంత్రం దోహాలో జరుగుతున్న ఈ క్రికెట్ లీగ్‌లో ఇండియా మహారాజా జట్టు ఆసియా లయన్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ధోనీ స్నేహితుడు అంటే రాబిన్ ఉతప్ప, క్రికెట్ ‘ప్రొఫెసర్’గా పేరుగాంచిన మహ్మద్ హఫీజ్‌ను చితక్కొట్టాడు.

ఇవి కూడా చదవండి

ఉతప్ప దెబ్బకు 2 ఓవర్లకే వెనుదిరిగిన బౌలర్..

ఈ మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్‌ను దంచి కొట్టినట్లు మరే బౌలర్‌ను కొట్టలేదు. ఫలితంగా 20 ఓవర్ల మ్యాచ్‌లో ఈ పాక్ బౌలర్ తన కోటాలో 4 ఓవర్లు కూడా వేయలేకపోయాడు. దీంతో క్రికెటర్ ‘ప్రొఫెసర్’ కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అందులో అతను 16.50 ఎకానమీ వద్ద 33 పరుగులు ఇచ్చాడు. ఈ సమయంలో అతని బౌలింగ్‌లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టారు. 6 బంతుల్లో హఫీజ్ 30 పరుగులు ఇచ్చాడు. ఇందులో బ్యాక్ టు బ్యాక్ 3 సిక్సర్ల వీడియో కూడా వైరల్ అవుతోంది.

6 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు, 30 పరుగులు..

హఫీజ్‌పై ఉతప్ప 3 సిక్సర్లు కొట్టడమే కాకుండా 3 ఫోర్లు బాదాడు. ఈ విధంగా కేవలం 6 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఉతప్ప మొత్తం 5 సిక్సర్లు బాది 39 బంతుల్లో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..