Team India: W, W, W, W, W.. 6 బంతుల్లో 5 వికెట్లు.. టీ20లో భారత బౌలర్ బీభత్సం.. కట్‌చేస్తే.. ఏడాదిలోనే కెరీర్ క్లోజ్

|

Sep 18, 2024 | 3:03 PM

Unique Records of Cricket: టీ20ల్లో బ్యాట్స్‌మెన్‌ల ఆధిపత్యం కనిపించే ఫార్మాట్. అయితే, బౌలర్లకు ఈ ఫార్మాట్‌ ఎంతో కష్టంగా అనిపిస్తుంది. పొట్టి ఫార్మాట్‌లో 5 వికెట్లు తీయడం సెంచరీ కంటే తక్కువేం కాదు. అయితే, ఒక బౌలర్ ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీశాడంటే బహుశా ఎవరూ నమ్మరు. 6 బంతుల్లో 6 సిక్సర్లు, ఒక్క ఓవర్లో హ్యాట్రిక్ కొట్టవచ్చు.

Team India: W, W, W, W, W.. 6 బంతుల్లో 5 వికెట్లు.. టీ20లో భారత బౌలర్ బీభత్సం.. కట్‌చేస్తే.. ఏడాదిలోనే కెరీర్ క్లోజ్
Abhimanyu Mithun
Follow us on

Unique Records of Cricket: టీ20ల్లో బ్యాట్స్‌మెన్‌ల ఆధిపత్యం కనిపించే ఫార్మాట్. అయితే, బౌలర్లకు ఈ ఫార్మాట్‌ ఎంతో కష్టంగా అనిపిస్తుంది. పొట్టి ఫార్మాట్‌లో 5 వికెట్లు తీయడం సెంచరీ కంటే తక్కువేం కాదు. అయితే, ఒక బౌలర్ ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీశాడంటే బహుశా ఎవరూ నమ్మరు. 6 బంతుల్లో 6 సిక్సర్లు, ఒక్క ఓవర్లో హ్యాట్రిక్ కొట్టవచ్చు. అయితే, ఒకే ఓవర్‌లో 5 వికెట్లు తీయడం అంటే అద్భుతం కంటే తక్కువే కాదు. ఇంత అద్భుతం చేసింది విదేశీయుడు కాదు.. తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లో భీభత్సం సృష్టించింది ఓ భారత బౌలర్ అంటే నమ్ముతారా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఏడాదిలోపే అంతర్జాతీయ కెరీర్ క్లోజ్..

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్ గురించి మాట్లాడితే.. అతను మూడు ఫార్మాట్లలో హ్యాట్రిక్ సాధించిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో మిథున్ ఈ ఘనత సాధించి వెలుగులోకి వచ్చాడు. అతని మెరుగైన బౌలింగ్ కారణంగా, అతనికి టీమ్ ఇండియా నుంచి పిలుపు కూడా వచ్చింది. కానీ, అభిమన్యు మిథుల్ అంతర్జాతీయ స్థాయిలో ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు. 2010లో అరంగేట్రం చేసిన మిథున్ కేవలం 4 టెస్టులు, 5 వన్డేలు మాత్రమే ఆడాడు. టెస్టులో 9 వికెట్లు, వన్డేల్లో 5 వికెట్లు తీశాడు.

మూడు ఫార్మాట్లలో హ్యాట్రిక్..

అభిమన్యు మిథున్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలోనే తన బౌలింగ్ మాయాజాలాన్ని చూపించాడు. 2009లో కర్ణాటక తరపున ఆడుతూ ఉత్తరప్రదేశ్‌పై హ్యాట్రిక్‌ సాధించి విధ్వంసం సృష్టించాడు. అభిమన్యు ఇక్కడితో ఆగలేదు. 2019లో అతని పుట్టినరోజున విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌లో హ్యాట్రిక్ సాధించాడు. టైటిల్ గెలవడానికి తన జట్టుకు సహాయం చేయడం ద్వారా తన పుట్టినరోజును చారిత్రాత్మకంగా మలచుకున్నాడు. ఎందుకంటే అతను తన జట్టు టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: Video: ‘పాక్ క్రికెట్ ఐసీయూలో ఉంది.. ప్రొఫెషనల్ డాక్టర్లు కావాలి’: మాజీ ప్లేయర్ విమర్శలు

టీ20లో ఒకే ఓవర్‌లో 5 వికెట్లు తీసి సంచలనం..

అభిమన్యు ఇప్పటికే ODI, లాంగ్ ఫార్మాట్లలో హ్యాట్రిక్ సాధించడం ద్వారా ముఖ్యాంశాలు చేశాడు. అయితే, ఈసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అభిన్యు తన ఒక్క ఓవర్‌లో ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అతని ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి నాలుగు బంతుల్లోనే హిమాన్షు రాణా, రాహుల్ తెవాటియా, సుమిత్ కుమార్, అమిత్ మిశ్రా వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌లను మిథున్ పెవిలియన్ బాట పట్టించాడు. దీని తర్వాత, ఒక వైడ్ బాల్ అతని స్పెషల్ స్పెల్‌కు కొద్దిగా అంతరాయం కలిగించింది. ఆ తర్వాత చివరి బంతికి జయంత్ యాదవ్ వికెట్ తీసి రికార్డు బుక్‌లో నమోదు చేసుకున్నాడు. ఈ భయంకరమైన బౌలింగ్ ఉన్నప్పటికీ, అతను టీమిండియా తరపున టీ20 ఆడే అవకాశం రాలేదు.

ఇది చదవండి: Watch Video: క్రికెట్‌కు దూరంగా ధోని.. ప్రస్తుతం ఏం చేస్తున్నాడో తెలుసా? బయటికొచ్చిన స్పెషల్ వీడియో

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..