Video: ‘ఫైనల్లో ఓటమితో రిటైర్మెంట్.. వద్దని ఆ రోజు నన్ను ఆపింది రోహిత్ శర్మనే’

|

Jul 03, 2024 | 10:46 AM

Rahul Dravid Emotional Farewell Speech: ప్రపంచకప్ గెలవాలన్న రాహుల్ ద్రవిడ్ అతిపెద్ద కల ఎట్టకేలకు నెరవేరింది. ద్రవిడ్ భారత్ తరఫున ఇంతకుముందు మూడు వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఆడినప్పటికీ, అతనికి ప్రపంచకప్ గెలిచే అవకాశం రాలేదు. ఇప్పుడు టీమ్ ఇండియా కోచ్‌గా టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

Video: ఫైనల్లో ఓటమితో రిటైర్మెంట్.. వద్దని ఆ రోజు నన్ను ఆపింది రోహిత్ శర్మనే
Rahul Dravid Rohit Sharma
Follow us on

Rahul Dravid Emotional Farewell Speech: టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ద్రవిడ్ తన కోచ్ పదవి ముగింపులో వీడ్కోలు ప్రసంగాన్ని పంచుకున్నాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగ క్షణాలు కనిపించాయి. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లకు కొన్ని మాటలు చెప్పి కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ ద్రవిడ్ వీడ్కోలు ప్రసంగంలోని 5 కీలకాంశాలు ఓసారి చూద్దాం..

ఎమోషనల్ ద్రవిడ్..

రాహుల్ ద్రవిడ్ తన వీడ్కోలు ప్రసంగంలో చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ఈ భావోద్వేగంతో మాట్లాడిన టీమ్ ఇండియా కోచ్, తన కెరీర్ చివరిలో, ఎటువంటి పరుగులు లేదా రికార్డులు గుర్తుకు రావడం లేదని, బదులుగా కొన్ని అద్భుత క్షణాలు మాత్రమే గుర్తుకు వస్తున్నాయని, కాబట్టి ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరారు.

ధైర్య పోరాటం..

తన చివరి ప్రసంగంలో ద్రవిడ్ గత రెండేళ్ల పోరాటాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన బృందం, సహాయక సిబ్బంది చేసిన కృషిని అభినందించారు. ఇటీవలి కాలంలో జట్టు బాగా ఆడింది. చాలా సార్లు ట్రోఫీకి దగ్గరగా వచ్చింది. కానీ, ఆ గీత దాటలేకపోయింది. ఇప్పుడు అంతా ఆ పని చేశారు. ఇప్పుడు దేశం మొత్తం మనల్ని చూసి గర్విస్తోందని సంతోషాన్ని పంచుకున్నారు.

గుర్తింపు..

టీమిండియాను ఉద్దేశించి రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ఈ ట్రోఫీ కోసం ప్రతి ఒక్కరి కుటుంబం చాలా పోరాడిందని అన్నాడు. వారి త్యాగానికి అంకితం అనే పదాలు లేవు. చివరగా వారందరికీ తమ విలువైన సహకారం అందించినందుకు మొత్తం టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

రోహిత్‌కి స్పెషల్ థాంక్స్..

ఈ సమయంలో, ద్రవిడ్ కూడా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశంసించాడు. ధన్యవాదాలు తెలిపాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఓటమి తర్వాత నేను రిటైర్మెంట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ, రోహిత్ నాకు ఫోన్ చేసి 2024 టీ20 ప్రపంచకప్ వరకు కోచ్‌గా ఉండమని అడిగాడు. ఆ రోజు అతను నాకు విజ్ఞప్తి చేశాడు. జట్టు కోచ్‌గా కొనసాగుతున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు.

కలిసి కట్టుగా ఉండాలని..

చివరగా, రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లందరూ జట్టుగా ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ విజయం ఏ ఒక్కరి విజయం కాదు. టీమ్ అంతా కలిసి ఈ విజయాన్ని సాధించారు. ఎల్లప్పుడు జట్టుగా ఆడాలని కోరారు. ఈ సలహాతో టీమిండియాలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్ ద్రవిడ్ తన వీడ్కోలు ప్రసంగాన్ని ముగించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..