Virat Kohli: పరుగులు చేయకపోతే..: కోహ్లీ పేలవ ఫాంపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..

|

Jun 23, 2022 | 4:54 PM

విరాట్ కోహ్లీ తన చివరి అంతర్జాతీయ సెంచరీని 2019లో బంగ్లాదేశ్‌పై చేశాడు. ఆ తర్వాత 73 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి సెంచరీ చేయలేకపోయాడు.

Virat Kohli: పరుగులు చేయకపోతే..: కోహ్లీ పేలవ ఫాంపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..
Virat Kohli (2)
Follow us on

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి గత రెండేళ్లుగా బ్యాడ్ ఫాంతో తంటాలు పడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ చేసి చాలా కాలం అయింది. ఐపీఎల్ 2022లో కూడా కోహ్లి పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. మూడు సందర్భాల్లో, అతను మొదటి బంతికే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక ప్రకటన చేశాడు. విరాట్‌ కోహ్లి లాంటి ఆటగాడు సెంచరీ లేకుండా చాలా కాలం గడవడం బాధగా ఉందని కపిల్‌దేవ్‌ అన్నాడు. ఇది భారత క్రికెట్‌తో పాటు అతని అభిమానులను ఆందోళనకు గురిచేస్తోందని కపిల్ దేవ్ అంగీకరించాడు. 2019 నవంబర్‌లో కోహ్లీ చివరిసారి అంతర్జాతీయ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

బ్యాట్ కచ్చితంగా మాట్లాడాలి: కపిల్

కపిల్ మాట్లాడుతూ, ‘నేను విరాట్ కోహ్లీ అంత క్రికెట్ ఆడలేదు. కొన్నిసార్లు మీరు తగినంత క్రికెట్ ఆడటం లేదు. కానీ, విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పరుగులు చేయకపోతే, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని ప్రజలు భావిస్తారు. ప్రజలు మీ పనితీరును మాత్రమే చూస్తారు. మీ పనితీరు సరిగ్గా లేకుంటే ప్రజలు మౌనంగా ఉంటారని ఆశించవద్దు. అందుకే బ్యాట్, ప్రదర్శన మాత్రమే మాట్లాడాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

సెంచరీ చేయలేకపోవడం బాధాకరం: కపిల్

కపిల్ మాట్లాడుతూ.. ‘ఇంత పెద్ద ఆటగాడు చాలా కాలంగా సెంచరీ చేయకపోవడం బాధగా ఉంది. అతను మాకు హీరోలాంటివాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో పోల్చగలిగే ఆటగాడిని మనం చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఇంతలా పేరు తెచ్చుకున్న కోహ్లీ.. సెంచరీ కోసం ఇన్నాళ్లు తీసుకోవడం చాలా బాధాకరం. ఇప్పుడు అతను గత రెండేళ్లుగా సెంచరీ చేయలేక పోవడంతో ఫ్యాన్స్‌తో పాటు మేమూ నిరాశలో ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

టీ20 సిరీస్‌కు విశ్రాంతి..

ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతి లభించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసింది. వచ్చే నెలలో ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభమయ్యే ఐదో టెస్టు విరామం తర్వాత కోహ్లి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రానున్నాడు. లీసెస్టర్‌షైర్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో కూడా కోహ్లీ బరిలోకి దిగాడు. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. రోహిత్ 25, గిల్ 21, విహారి 3, అయ్యర్ 0 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. కోహ్లీ 4, జడేజా 1 పరుగుతో బ్యాటింగ్ చేస్తున్నారు.