IND vs AUS: బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే.. తెలుగు తేజం అవుట్..ఆ ప్లేయర్‌కి ఛాన్స్
బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో నాలుగో మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాలుగో టెస్టు డిసైడర్ మ్యాచ్ కావడంతో ఇరు జట్లూ ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. నాలుగో టెస్టుకు టీమిండియా జట్టులో కీలక మార్పులో చేయనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు తేజం నితీశ్ రెడ్డి ప్లేస్‌లో సుందర్‌కి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో భారత్‌కు ఫైనల్‌కు వెళ్లడం కష్టంగా మారింది. కాబట్టి భారత్ ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే నాలుగు, ఐదో టెస్టుల్లో విజయం సాధించాలి. నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ పిచ్‌ను అంచనా వేస్తూ ఆస్ట్రేలియా ఇప్పటికే ప్లేయింగ్ 11ని ప్రకటించింది. ఇదిలా ఉంటే నాలుగో టెస్టుకు టీమిండియాలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది.
జస్ప్రీత్ బుమ్రా తప్ప, తొలి మూడు టెస్టుల్లో బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. కాబట్టి రోహిత్ శర్మ అదనపు స్పిన్ ఆల్ రౌండర్‌కు మెల్‌బోర్న్ టెస్టులో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. నాలుగో టెస్టులో వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. టీమ్ ఇండియా ప్లేయింగ్ XIలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్లుగా కనిపిస్తారు. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ కూడా ఫాస్ట్ బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు.
ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని మూడో టెస్టుకు తప్పించే అవకాశం ఉంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ చక్కటి ప్రదర్శన కనబరించారు. మరోవైపు శుభమన్ గిల్ స్థానం కూడా చిక్కుల్లో పడింది. ఎందుకంటే నాలుగో టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి శుబ్‌మన్ గిల్‌ను మినహాయిస్తే, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ అవకాశం పొందవచ్చు.
భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్/నితీష్ కుమార్ రెడ్డి, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాన్స్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి