Rohit Sharma: క్యాచ్ మిస్ చేసిన సర్ఫరాజ్.. వీపుపై ఒక్కటిచ్చిన రోహిత్..

|

Dec 02, 2024 | 9:08 PM

ఈ వార్మప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టు నిర్ణీత 46 ఓవర్లలో 240 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Rohit Sharma: క్యాచ్ మిస్ చేసిన సర్ఫరాజ్.. వీపుపై ఒక్కటిచ్చిన రోహిత్..
Rohit Sharma Video
Follow us on

Rohit Sharma: డిసెంబర్ 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. పింక్ బాల్ మ్యాచ్‌కు ముందు కాన్‌బెర్రాలో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడింది. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కీపర్‌గా కనిపించాడు. టీమ్ ఇండియా బౌలర్లు నిరంతర బౌన్సర్లు విసురుతుండగా సర్ఫరాజ్ బంతిని పట్టుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.

ఇవి కూడా చదవండి

హర్షిత్ రాణా 23వ ఓవర్లో ఓలివర్ డేవిస్‌కి బౌన్సర్‌ విసిరాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ బంతిని పట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కోపం వచ్చింది.

అయితే, రోహిత్ శర్మ తన కోపాన్ని అదుపు చేసుకుని సర్ఫరాజ్ ఖాన్ వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. ఇప్పుడీ హిట్‌మ్యాన్ పంచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వార్మప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టు నిర్ణీత 46 ఓవర్లలో 240 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..