MS Dhoni Riding A Bike at The Farm House: భారత జట్టులో కెప్టెన్ కూల్‌గా ప్రసిద్ది చెందిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికీ ధోని ఫాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఏ చిన్న ఫొటో వచ్చినా.. వీడియో కనిపించినా.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటారు. ఎందుకంటే, ధోని సోషల్ మీడియా అకౌంట్స్ వాడడు. దీంతో ఎవరో ఒకరు షేర్ చేసిన వీడియోలు, ఫొటోలే కనిపిస్తుంటాయి. అయితే, ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతోన్న ధోని.. వచ్చే సీజన్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025కు చాలా సమయం ఉంది. దీంతో తన ఫాం హౌస్‌లో సేద తీరుతున్నాడు. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఓ వీడియో ఫ్యానస్‌ను అలరిస్తోంది. ధోనికి బైక్‌లు నడపడం అంటే చాలా ఇష్టం అని మనందరికీ తెలిసిందే. భారత మాజీ కెప్టెన్ మరోసారి బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోలో మహేంద్ర సింగ్ ధోని సినిమా హీరోలా బైక్‌పై వేగంగా వెళుతున్నట్లు చూడవచ్చు. ఈ వీడియో ధోని స్వగ్రామంలో ఉన్న ఫామ్‌హౌస్‌లోనిది. ఈ ఫన్నీ వీడియోపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ధోనీ బైక్ రైడింగ్ స్టైల్ సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతోంది.
MS DHONI – THE RIDER. 😎⚡
Cruising through his hometown with those legendary vibes! #Dhoni #CaptainCool #HometownRider— ANOOP SAMRAJ (@CricSamraj) September 27, 2024
మిస్టర్ ఫినిషర్‌గా పిలుచుకునే ధోనీ.. ప్రపంచంలోనే గొప్ప కెప్టెన్‌గా, వికెట్‌కీపర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతను 15 ఆగస్టు 2020న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు IPLలో మాత్రమే ఆడుతున్నాడు. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఛాంపియన్‌గా చేశాడు. అయితే, 2024 IPL సీజన్‌లో, అతను కెప్టెన్సీ బాధ్యతను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. అతను CSK తరపున వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025లో కూడా మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా లేదా అనే విషయంపై చర్చలు నడుతుస్తున్నాయి. ధోని వచ్చే సీజన్‌లో ఆడవచ్చని కొన్ని నివేదికలలో సమాచారం అందింది.
మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ కెరీర్‌ను పరిశీలిస్తే, అతను 90 టెస్టులు, 350 వన్డేలు మరియు 98 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ మ్యాచ్‌లలో, అతను 144 ఇన్నింగ్స్‌లలో 38.01 సగటుతో 4876 పరుగులు చేశాడు. అదే సమయంలో, అతను ODIలో 10773 పరుగులు మరియు T20లో 1617 పరుగులు 50.06 అద్భుతమైన సగటుతో చేశాడు. ధోనీ ఐపీఎల్ కెరీర్ గురించి చెబుతూ, 2008 నుంచి 2024 వరకు 264 మ్యాచ్‌లు ఆడిన 229 ఇన్నింగ్స్‌ల్లో 5243 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..