T20I Rankings: పాకిస్థాన్‌పై తుఫాన్ ఇన్నింగ్స్.. టీ20 ర్యాకింగ్స్ లో సత్తా చాటిన భారత ఆల్ రౌండర్.. కెరీర్ లో బెస్ట్ ప్లేస్..
ఆసియా కప్‌లో ఆదివారం పాకిస్థాన్‌పై హార్దిక్ పాండ్యా 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత 17 బంతుల్లో 33 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

Hardik Pandya: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై హార్దిక్ పాండ్యా బంతితోపాటు బ్యాటింగ్‌తో బలమైన ఆటతో సత్తా చాటాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో తన కెరీర్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్‌కు చేరుకున్నాడు. ఐదో ర్యాంక్‌లో ఉన్నాడు. మొత్తం ఎనిమిది స్థానాలు ఎగబాకాడు. టాప్-10 ఆల్ రౌండర్లలో ఉన్న ఏకైక భారత ఆటగాడిగా నిలిచాడు. అదే విధంగా బ్యాట్స్‌మెన్ టాప్-10లో సూర్యకుమార్ యాదవ్, బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ టాప్-10లో ఉన్నారు.
గతేడాది జరిగిన టీ20 అంతర్జాతీయ ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యా చాలా కాలం క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అతని పేరు చాలా దూరంగా ఉంది. కానీ, IPL 2022లో, అతను తిరిగి వచ్చాడు. T20 ఇంటర్నేషనల్ సిరీస్‌లలో ఒకదాని తర్వాత ఒకటిగా ఆల్ రౌండర్‌తో సత్తా చాటడంతో.. తన ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నాడు. తాజాగా ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి వచ్చాడు.




మహ్మద్ నబీ అగ్రస్థానం..
టీ 20 ఇంటర్నేషనల్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ ఆటగాడు మహ్మద్ నబీ (257) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక్కడ బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ (245) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో మొయిన్ అలీ (221), నాలుగో స్థానంలో గ్లెన్ మాక్స్‌వెల్ (183) ఉన్నారు. హార్దిక్ పాండ్యాకు 167 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
Some big movements in the @MRFWorldwide ICC Men’s T20I Player Rankings after the first few matches of #AsiaCup2022 ??
Details ?https://t.co/Mu2pzpq5GW
— ICC (@ICC) August 31, 2022
బ్యాట్స్‌మెన్‌లలో బాబర్ ఆజం దూకుడు..
పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం 810 రేటింగ్ పాయింట్లతో టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని సహచరుడు మహ్మద్ రిజ్వాన్ (796) ఇక్కడ రెండో స్థానంలో ఉన్నాడు. టీమ్‌ఇండియా అద్భుత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (792) మూడో స్థానంలో నిలవగా, దక్షిణాఫ్రికాకు చెందిన ఐడాన్ మార్క్రామ్ (792) కూడా అదే పాయింట్లతో నాలుగో ఆర్డర్‌లో ఉన్నాడు. ఐదవ స్థానం డేవిడ్ మలన్ (731) నిలిచాడు.
బౌలర్లలో, టాప్-10 T20 అంతర్జాతీయ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారతదేశం నుంచి భువనేశ్వర్ కుమార్ మాత్రమే టాప్-10లో ఉన్నాడు. అతను ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఆస్ట్రేలియాకు చెందిన జోస్ హేజిల్‌వుడ్ (792) నంబర్‌వన్‌గా ఉన్నాడు. తబ్రేజ్ షమ్సీ (716) రెండో స్థానంలో, రషీద్ ఖాన్ (708) మూడో స్థానంలో, ఆదిల్ రషీద్ (702) నాలుగో స్థానంలో, ఆడమ్ జంపా (698) ఐదో స్థానంలో ఉన్నారు.




