Team India: బహుమతులే బహుమతులు.. మహిళా క్రికెటర్లకు క్యాష్ ప్రైజ్‌తో పాటు రూ. 25 లక్షల కార్లు కూడా..
టాటా మోటార్స్ ప్రకారం, వన్డే ప్రపంచ కప్ విజేత జట్టులోని ప్రతి ఆటగాడు, సహాయక సిబ్బందికి 1990లలో "లైఫ్ స్టైల్ వాహనం"గా ప్రారంభించిన టాటా సియెర్రా SUV టాప్-ఎండ్ మోడల్ అందజేయనుంది. కొత్త సియెర్రా డిజైన్ పాత సియెర్రాకు అప్ డేట్ వర్షన్‌గా రానుంది.

Women’s World Cup 2025: నవంబర్ 2న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత మహిళా క్రికెట్ జట్టు మహిళల వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. టీమిండియా అద్భుతమైన ప్రదర్శన తర్వాత, దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ జట్టుకు ప్రత్యేక బహుమతిని ప్రకటించింది. టాటా మోటార్స్ ప్రతి క్రీడాకారిణికి సుమారు రూ. 25 లక్షలఒ విలువైన కారును ఇవ్వాలని నిర్ణయించింది.
టీం ఇండియా ఆటగాళ్లకు ఏ కార్ ఇవ్వనున్నారంటే..
మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా జట్టుకు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నుంచి ప్రత్యేక బహుమతి లభిస్తుంది. టాటా మోటార్స్ టీం ఇండియాలోని ప్రతి క్రీడాకారిణికి, సహాయక సిబ్బందికి ఒక కొత్త టాటా సియెర్రా SUVని బహుమతిగా ఇవ్వనుంది.
ఈ విషయాన్ని ప్రకటిస్తూ, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర మాట్లాడుతూ, “భారత మహిళా జట్టు తమ దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో దేశానికి గర్వకారణమైన క్షణాన్ని అందించింది. వారి విజయాన్ని గౌరవించడం మాకు సంతోషంగా ఉంది. టాటా సియెర్రా భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఒక వారసత్వ చిహ్నం. ఈ కారును క్రీడాకారిణులకు బహుమతిగా ఇస్తున్నందుకు మేం సంతోషంగా ఉన్నాం” అని అన్నారు.
నవంబర్ 25న లాంచ్..
టాటా మోటార్స్ ప్రకారం, వన్డే ప్రపంచ కప్ విజేత జట్టులోని ప్రతి ఆటగాడు, సహాయక సిబ్బందికి 1990లలో “లైఫ్ స్టైల్ వాహనం”గా ప్రారంభించిన టాటా సియెర్రా SUV టాప్-ఎండ్ మోడల్ అందజేయనుంది. కొత్త సియెర్రా డిజైన్ పాత సియెర్రాకు అప్ డేట్ వర్షన్‌గా రానుంది.
ఇది ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ (మూడు-స్క్రీన్ సెటప్), లెవెల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే 1.5-లీటర్ టర్బోడీజిల్ ఇంజిన్ తరువాత విడుదల అవుతుంది. ఈ SUV ధర రూ. 13.50 లక్షల నుంచి రూ. 24 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ SUV నవంబర్ 25న భారతదేశంలో విడుదల కానుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








