AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : మీ స్కిన్ గ్లో సీక్రెట్ ఏంటి సార్?.. ప్రశ్నించిన క్రికెటర్.. అదిరిపోయే ఆన్సరిచ్చిన మోదీ.. వీడియో వైరల్

ప్రపంచకప్‌లో తొలిసారి చారిత్రక విజయాన్ని సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మోదీ ఆట గురించే కాకుండా, వారి వ్యక్తిగత విషయాలు, టాటూలు, ఇన్‌స్టా అకౌంట్ల గురించి కూడా సరదాగా చర్చించారు. ఈ సమావేశంలో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర సన్నివేశం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.

Video : మీ స్కిన్ గ్లో సీక్రెట్ ఏంటి సార్?.. ప్రశ్నించిన క్రికెటర్.. అదిరిపోయే ఆన్సరిచ్చిన మోదీ.. వీడియో వైరల్
Pm Modi
Rakesh
|

Updated on: Nov 06, 2025 | 4:43 PM

Share

Video : ప్రపంచకప్‌లో తొలిసారి చారిత్రక విజయాన్ని సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మోదీ ఆట గురించే కాకుండా, వారి వ్యక్తిగత విషయాలు, టాటూలు, ఇన్‌స్టా అకౌంట్ల గురించి కూడా సరదాగా చర్చించారు. ఈ సమావేశంలో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర సన్నివేశం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. జట్టులోని టాప్-ఆర్డర్ బ్యాట్స్‌వుమెన్ హర్లీన్ డియోల్ ప్రధానిని ఉద్దేశిస్తూ మీ స్కిన్ గ్లో వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి సార్ ? అని అడిగిన ప్రశ్నకు, ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానంతో ఆ హాలు మొత్తం నవ్వులతో నిండిపోయింది.

గత వారం నవీ ముంబైలో జరిగిన ఫైనల్‌లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు, కోచ్ అమోల్ మజుందార్, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో కలిసి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుసుకుంది. ఈ సందర్భంగా మోదీ చాంపియన్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు అద్భుతంగా ఆడారు. భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, ఇది భారత ప్రజల జీవితంలో ఒక భాగం. క్రికెట్‌లో ఏదైనా మంచి జరిగితే, భారతదేశం సంతోషిస్తుంది. కొద్దిగా ఏదైనా పొరపాటు జరిగినా యావత్ దేశం బాధపడుతుంది” అని అన్నారు.

ఈ సమావేశంలో ప్రధాని మోదీ క్రీడాకారులతో సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలో టాప్-ఆర్డర్ బ్యాట్స్‌వుమెన్ హర్లీన్ డియోల్ అడిగిన ఒక ప్రశ్న నవ్వులు పూయించింది. హర్లీన్ డియోల్ ప్రధాని మోదీని ఉద్దేశించి.. “సార్, నేను మీ స్కిన్‌కేర్ రొటీన్ గురించి అడగాలనుకుంటున్నాను. మీరు చాలా గ్లో అవుతుంటారు సార్” అని అడిగింది. ఈ ప్రశ్నకు అక్కడ ఉన్న ప్లేయరంతా బిగ్గరగా నవ్వారు. ప్రధాని మోదీ తన కుడి చేతితో ముఖాన్ని దాచుకుంటూ కనిపించారు. “నేను ఈ విషయాల గురించి ఆలోచించను” అని నవ్వుతూ సమాధానం ఇచ్చి వెంటనే తన గ్లోకు కారణం దేశ ప్రజల ప్రేమ అని అన్నారు.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో కూడా ప్రధాని మోదీ ముఖ్యమైన విషయాలు చర్చించారు. “సార్, 2017లో మిమ్మల్ని కలిసినప్పుడు మేము ట్రోఫీతో రాలేదు. కానీ ఇన్నేళ్లుగా మేము కష్టపడిన తర్వాత ఈసారి కప్పును మీ దగ్గరకు తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా మిమ్మల్ని తరచుగా కలిసి మీతో ఫోటోలు తీసుకోవడం మా లక్ష్యం” అని హర్మన్‌ప్రీత్ 2017 నాటి పరాజయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రధాని మోదీ, టోర్నమెంట్‌లో బెస్ట్ ప్లేయర్గా నిలిచిన దీప్తి శర్మను ఆమె చేతిపై ఉన్న హనుమాన్ టాటూ గురించి అడిగారు, అది సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..