వరల్డ్ కప్ ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ పై ఉత్కంఠ.. ఏ.ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ తొక్కిసలాట నేపథ్యంలో హై అలర్ట్..

క్రికెట్ అభిమానుల కొలహాలానికి సమయం ఆసన్నమైంది. 2023 ప్రపంచ క్రికెట్ కప్ పోరు ఇప్పటికే మొదలైంది. కానీ భారత్ లో క్రికెట్ అభిమానులకు అసలైన కిక్ మొదలయ్యేది మాత్రం రేపటి నుంచే. చెన్నైలోని చెపాక్ క్రికెట్ మైదానంలో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది. భారత్ ఆస్ట్రేలియాతో తలపడే మ్యాచ్ అంటే మాములుగా ఉండదు. అలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఉన్నారు.

వరల్డ్ కప్ ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ పై ఉత్కంఠ.. ఏ.ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ తొక్కిసలాట నేపథ్యంలో హై అలర్ట్..
Tamil Nadu Government Special Focus On India Australia Match Arrangements Telugu Sports News

Edited By:

Updated on: Oct 08, 2023 | 7:27 AM

Andhra Pradesh: క్రికెట్ అభిమానుల కొలహాలానికి సమయం ఆసన్నమైంది. 2023 ప్రపంచ క్రికెట్ కప్ పోరు ఇప్పటికే మొదలైంది. కానీ భారత్ లో క్రికెట్ అభిమానులకు అసలైన కిక్ మొదలయ్యేది మాత్రం రేపటి నుంచే. చెన్నైలోని చెపాక్ క్రికెట్ మైదానంలో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది. భారత్ ఆస్ట్రేలియాతో తలపడే మ్యాచ్ అంటే మాములుగా ఉండదు. అలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఉన్నారు. ఇక నేరుగా మైదానంలో చూడడానికి ఇప్పటికే టికెట్లు పొందిన అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. అయితే మ్యాచ్ పై వర్షం ప్రభావం ఉంటుందా అన్న టెన్షన్ అభిమానుల్లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేది ప్రభుత్వం అటెన్షన్. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ మ్యూజిక్ కాన్సెర్ట్ లో తొక్కిసలాట వివాదాస్పదంగా మారింది. వందలాది మంది అభిమానులు అస్వస్థతకు గురయ్యారు.

చెన్నై సిటీలోని ఈస్ట్ కోస్ట్ రోడ్(ఈసీఆర్) లోని పన్నయూర్ లో భారీ సెట్ ఏర్పాటు చేసి ఎసిటిసి ఈవెంట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ జరిగింది. ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ టికెట్లు ఆన్లైన్లో విక్రయాలకు పెట్టింది. సుమారు లక్షకు పైగా టికెట్లు అమ్మకాలు జరిగాయి.. ఈవెంట్ కోసం వెన్యూ బయట భారీ జనం.. వెన్యూ ప్రాంగణం పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోయింది. రోడ్డుపై ఇంకా భారీగా జనం.. లోనికి వెళ్ళడానికి ఖాళీ లేదు.. అప్పటికే లోపలకు వెళ్లిన వారికి స్థలం లేదు.. ఇంకా ఈసీఆర్ వైపు పన్నయూర్ కు క్యూ కట్టారు మ్యూజిక్ లవర్స్.. అదే సమయంలో తన పర్యటన ముగించుకుని నివాసానికి వెళుతున్న సీఎం స్టాలిన్ కాన్వాయ్ ఆ ప్రాంతానికి చేరుకుంది. ట్రాఫిక్ లో సీఎం కాన్వాయ్ లోని వాహనాలు అంగుళం కూడా ముందుకు కదలలేదు. సుమారు అర్ధ గంటపాటు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో దారి మళ్లించి మరో మార్గంలో సీఎంను ఇంటికి తీసుకెళ్లారు పోలీసులు. సుమారు మూడు గంటలకు పైగా ఆలస్యం అయ్యింది.

ఇక్కడ సీఎం స్టాలిన్ కన్నా ఇబ్బంది పడింది వేలాదిమంది ప్రజలు. కార్యక్రమం జరిగే ప్రాంగణానికి వచ్చింది కేవలం 40 వేలు మంది మాత్రమే.. ఇంకా వేలల్లో టికెట్లు కొనుగోలు చేసినవారు ఎక్కడిదాక రాలేక పోయారు.. వచ్చినవారికి స్థలం లేదు.. ఒక్కో టికెట్టు ధర 2 వేల నుంచి 20 వేల వరకు ఉంది.. అయినా కార్యక్రమం చూడలేక పోయారు. అక్కడ జరిగిన తొక్కిసలాట లో వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.. దీంతో సీఎం ఘటన ను తనకు జరిగిన ఇబ్బందిగా కాకుండా ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు, నిర్వహకులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఇప్పుడు చెన్నైలో జరిగే భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో అలాంటి పరిస్థితి లేకుండా ప్రత్యేక చర్యలకు ఆదేశించారు. దీంతో ఒక రోజు ముందునుంచే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చెపాక్ స్టేడియం వైపు వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధించి వాహనాలను దారి మళ్లించారు.

ఇవి కూడా చదవండి

క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చేవారిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఎవరైతే పాసులు కలిగి ఉంటారో వారిని మాత్రమే అనుమతిస్తారు. అది కూడా ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. స్టేడియం పరిమితి మేరకే అభిమానులను అనుమతిస్తారు. అంతకు మించి టికెట్లు పొంది ఉన్నా వారిని ఆతర్వాత అనుమతించేది లేదని ఇప్పటికే ప్రకటన రూపంలో పోలీసు అధికారులు తెలిపారు. అలాగే ఒకే మార్గంలో ఎక్కువ మంది రావడానికి లేదని మూడు మార్గాల్లో వివిధ ఎంట్రీ గేట్ల ద్వారా అనుమతించనున్నట్లు చెప్పారు. ఇక అభిమానుల్లో మరో టెన్షన్.. చెన్నై నగరంలో ఇటీవల రెండు వారాలుగా ఎదో ఒక చోట వర్షం పడుతూనే ఉంది. శుక్రవారం కూడా చెన్నై శివారు ప్రాంతంలో వర్షం కురిసింది. ఇప్పటికే భారత్ గౌహతి, తిరువనంతపురం లో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి.. ఇపుడు భారత్ తొలి మ్యాచ్ కు వాన గండం ఉండకూడదని ప్రార్ధిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..