T20 World Cup: 2007 నుంచి 2021 వరకు.. టీ20 ప్రపంచ కప్‌లో టాప్ 10 రికార్డులు ఇవే..

|

Oct 15, 2022 | 8:40 PM

T20 World Cup Records: 2007 నుంచి 2021 వరకు ఏడు T20 ప్రపంచ కప్‌లు జరిగిని సంగతి తెలిసిందే. ఇందులో వెస్టిండీస్ టీం అత్యధికంగా రెండు సార్లు ఈ ట్రోఫీని గెలుచుకుంది.

T20 World Cup: 2007 నుంచి 2021 వరకు.. టీ20 ప్రపంచ కప్‌లో టాప్ 10 రికార్డులు ఇవే..
T20 World Cup
Follow us on

T20 ప్రపంచ కప్ 2022 ఆదివారం (16 అక్టోబర్) నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎనిమిదో టీ20 ప్రపంచకప్‌. ఇప్పటివరకు జరిగిన ఏడు టీ20 ప్రపంచకప్‌లలో వెస్టిండీస్ రెండుసార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది కాకుండా భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఒక్కోసారి ఈ ట్రోఫీని గెలుచుకున్నాయి. 2007 నుంచి 2021 వరకు జరిగిన ఈ ఏడు T20 ప్రపంచ కప్‌లలో 10 భారీ రికార్డులను ఇప్పుడు చూద్దాం..

అత్యధిక పరుగులు: టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే పేరిట ఉంది. 31 మ్యాచ్‌ల్లో 1016 పరుగులు చేశాడు.

అత్యధిక సెంచరీలు: టీ20 ప్రపంచకప్‌లో క్రిస్ గేల్ రెండు సెంచరీలు సాధించాడు. వీరే కాకుండా ఏడుగురు బ్యాట్స్‌మెన్స్ ఒక్కో సెంచరీ సాధించారు.

ఇవి కూడా చదవండి

ఉత్తమ స్కోరు: 2012 టీ20 ప్రపంచకప్‌లో బ్రెండన్ మెకల్లమ్ బంగ్లాదేశ్‌పై 123 పరుగులు చేశాడు.

అత్యధిక 50+ పరుగుల ఇన్నింగ్స్: ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. అతను 21 మ్యాచ్‌ల్లో 10 సార్లు 50 పరుగులకు పైగా ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లీ ఇక్కడ కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. 2014 టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ 319 పరుగులు చేశాడు.

అత్యధిక సిక్సర్లు: క్రిస్ గేల్ ఇక్కడ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 33 మ్యాచ్‌ల్లో 63 సిక్సర్లు కొట్టాడు.

అత్యధిక వికెట్లు: బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ 31 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు సాధించాడు.

ఓ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు: ఈ రికార్డు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ వనిందు హసరంగా పేరిట నమోదైంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో హస్రంగ 16 వికెట్లు పడగొట్టాడు.

అత్యధిక క్యాచ్‌లు: ఏబీ డివిలియర్స్ 30 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 23 క్యాచ్‌లు అందుకున్నాడు.

వికెట్ వెనుక అత్యధిక ఔట్లు: ఎంఎస్ ధోని T20 ప్రపంచ కప్‌లో 33 మ్యాచ్‌లలో 32 మందిని పెవిలియన్ చేర్చాడు.