IND vs ENG: ఇంగ్లండ్‌పై రోహిత్ సేనదే ఆధిపత్యం.. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రికార్డులు ఎలా ఉన్నాయంటే..

భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు కూడా సెమీస్ చేరుకున్నాయి. నవంబర్ 9న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. అదే సమయంలో నవంబర్ 10న అడిలైడ్‌లో జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.

IND vs ENG: ఇంగ్లండ్‌పై రోహిత్ సేనదే ఆధిపత్యం.. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రికార్డులు ఎలా ఉన్నాయంటే..
India Vs England Semi Final

Updated on: Nov 07, 2022 | 5:59 PM

T20 World Cup Semi-finals 2022: భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు కూడా సెమీస్ చేరుకున్నాయి. నవంబర్ 9న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. అదే సమయంలో నవంబర్ 10న అడిలైడ్‌లో జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. సూపర్-12 గ్రూప్-2 చివరి మ్యాచ్‌లో టీమిండియా(Team India) 71 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించి టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు కూడా సెమీస్ చేరుకున్నాయి. నవంబర్ 9న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. అదే సమయంలో నవంబర్ 10న అడిలైడ్‌లో జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై భారత్ ప్రదర్శన ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల ట్రాక్ రికార్డును ఓసారి పరిశీలిస్తాం.

మొదటి సెమీ ఫైనల్: New Zealand vs Pakistan

ఈ రెండు జట్లలో పాకిస్తాన్ టీం వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా ఆరోసారి టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. న్యూజిలాండ్ జట్టు వరుసగా మూడోసారి, ఓవరాల్‌గా నాలుగోసారి చివరి నాలుగుకు చేరుకుంది. ఈ రెండు జట్లు టీ20 ఇంటర్నేషనల్స్‌లో 28 సార్లు తలపడ్డాయి. పాకిస్థాన్ 17 సార్లు గెలిచింది. న్యూజిలాండ్ 11 మ్యాచ్‌లు గెలిచింది.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌లో ఈ జట్లు ఇప్పటి వరకు 6 సార్లు తలపడ్డాయి. పాకిస్థాన్ 4, న్యూజిలాండ్ 2 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 2007 ప్రపంచకప్‌ సెమీ-ఫైనల్స్‌లో పాకిస్థాన్ టీం న్యూజిలాండ్‌తో తలపడినప్పుడు పాకిస్థాన్ విజేతగా నిలిచింది.

రెండో సెమీ ఫైనల్: India vs England.. టీమిండియాదే పైచేయి..

1. టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ ఇప్పటి వరకు 3 సార్లు తలపడ్డాయి. 2 రెండింట్లో టీమ్ ఇండియా గెలిచింది. ఇంగ్లండ్ 1 మ్యాచ్ గెలిచింది.

2. 2007 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య తొలి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు బాదాడు. భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

3. 2009 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.

4. 2012 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా 90 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది.

5. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏ నాకౌట్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..