టీ20 ఇంటర్నేషనల్స్‌లో వందల మంది తప్పక చూస్తుంటారు. రికార్డులతోపాటు థ్రిల్లింగ్ ఈ పొట్టి ఫార్మాట్ సొంతం. అయితే, అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ కొడితే ఇక ఆ బ్యాట్స్‌మెన్ క్రేజ్ మాములుగా ఉండదు. సరిగ్గా ఇదే పని చేయడం ద్వారా 22 ఏళ్ల కెనడా బ్యాట్స్‌మెన్ మాథ్యూ స్పూర్స్(Matthew Spoors) చరిత్ర సృష్టించాడు. అతను టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్(T20 World Cup Qualifier)లో ఫిలిప్పీన్స్‌పై అరంగేట్రం చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ మొదటి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ బాదేశాడు. అతని సెంచరీ ఇన్నింగ్స్ ప్రస్తుతం చరిత్ర పుటల్లో నమోదైంది. ఎందుకంటే, డెబ్యూలో ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్ కావడం విశేషం. మాథ్యూ స్పర్ కెనడా (Canada) తరపున తన టీ20 అరంగేట్రం చేసి, ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ స్క్రిప్ట్‌ను రాశాడు.
ఫిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌కు వచ్చాడు. తన భాగస్వామి రియాన్ పఠాన్‌తో కలిసి తొలి వికెట్‌కు 149 పరుగులు జోడించాడు. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో, మాథ్యూ చివరి వరకు నాటౌట్‌గా ఉన్నాడు. అదే సమయంలో, అతని ఓపెనింగ్ భాగస్వామి రియాన్ పఠాన్ 73 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు.
అరంగేట్రంలోనే మాథ్యూ స్పర్స్ అజేయ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ ఓపెనర్ మాథ్యూ స్పర్స్ 66 బంతులు ఎదుర్కొన్నాడు. అందులో అతను 108 (నాటౌట్) పరుగులు సాధించాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 14 ఫోర్లు, 3 సిక్సర్లు రాలాయి. మాథ్యూ స్పర్స్ ఈ అజేయ సెంచరీ కారణంగా కెనడా 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 216 పరుగులు చేసింది.
118 పరుగుల భారీ తేడాతో విజయం..
ఫిలిప్పీన్స్ ముందు విజయానికి 217 పరుగుల భారీ లక్ష్యం ఉంది. కానీ, ఈ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ మ్యాచ్‌లో కెనడా 118 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో కెనడా తన గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో గ్రూప్-బిలో కెనడా, ఫిలిప్పీన్స్ జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్ కావడం కూడా విశేషం.
టీ20 అంతర్జాతీయ అరంగేట్రంలోనే సెంచరీ చేసి అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన మాథ్యూ స్పర్స్‌ను కెనడా విజయ హీరోగా మారాడు. అతని సెంచరీ ఫలితంగా కెనడా మ్యాచ్‌లో మొత్తం 216 పరుగులు చేసింది. ప్రస్తుతం కెనడా తన తదుపరి మ్యాచ్‌ని ఒమన్‌తో ఆడాల్సి ఉంది.
?? History made as Canada’s Matthew Spoors posts the highest score ever by a T20I debutant!
His 108* runs came off just 66 balls as Canada defeated the Philippines by 118 runs in the 2022 ICC Men’s T20 World Cup Qualifier A.#T20WorldCup pic.twitter.com/vLAebdwgZB
— T20 World Cup (@T20WorldCup) February 19, 2022