
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. ఈ విజయం ద్వారా ప్రోటీస్ తమ సెమీఫైనల్ అవకాశాలను మరింత బలపరుచుకోవడంతో పాటు, టీమిండియా సెమీఫైనల్ రేసుకు కూడా భారీ ఊరటనిచ్చింది.
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు దిశగా నడిపించాడు. క్వింటన్ డికాక్, రయన్ రికెల్టన్‌లు కూడా కీలక భాగస్వామ్యాలతో మార్క్రామ్‌కు చక్కటి సహకారం అందించారు. 177 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 16.1 ఓవర్లలోనే ఛేదించడం ఈ మ్యాచ్‌లో వారి ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది.
దక్షిణాఫ్రికా ఈ విజయం ద్వారా సెమీఫైనల్ చేరాలన్న తమ లక్ష్యాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లింది. అంతేకాదు, వెస్టిండీస్‌పై వచ్చిన ఈ ఓటమితో వారి నెట్ రన్ రేట్ భారీగా పడిపోవడం భారత్‌కు అనుకూలంగా మారింది.
వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి దక్షిణాఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ లక్ష్య చేధనలో ప్రోటీస్ ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా 23 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాయి.
9 వికెట్ల తేడాతో వచ్చిన ఈ ఘోర ఓటమి కారణంగా వెస్టిండీస్ నెట్ రన్ రేట్ 5.35 నుంచి 1.791కు పడిపోయింది. ఈ మార్పుతో సూపర్-8 గ్రూప్‌లో భారత్‌కు సెమీఫైనల్ చేరే అవకాశాలు గణనీయంగా పెరిగాయి.
ఇప్పుడు భారత్ తన మిగిలిన మ్యాచ్‌ల్లో మంచి తేడాతో గెలిస్తే, నెట్ రన్ రేట్ పరంగా వెస్టిండీస్‌ను దాటే అవకాశాలు మరింత బలపడతాయి. అంటే భారత్ సెమీఫైనల్ చేరే భవితవ్యము ఇప్పుడు చాలా వరకు తన చేతుల్లోనే ఉంది.
దక్షిణాఫ్రికా సూపర్-8లో వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ జట్టు సెమీఫైనల్‌కు చాలా దగ్గరగా వచ్చింది. ఆఫ్రికా 2 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించింది. గ్రూప్-1 పాయింట్ల పట్టికలో ఆ జట్టు మొదటి స్థానంలో ఉంది. వెస్టిండీస్ 2 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. భారత జట్టు మూడవ స్థానంలో, జింబాబ్వే నాల్గవ స్థానంలో ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..