T20 World Cup 2024: సూపర్ 8కు ముందు టీమిండియాకు ఊహించని షాక్.. ప్రాక్టీస్‌లో స్టార్ ప్లేయర్‌కు గాయం

|

Jun 18, 2024 | 12:30 PM

ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌కప్‌-2024 లో టీమిండియా అదరగొడుతోంది. గ్రూపు స్టేజిలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి అదరగొట్టింది. కెనడాతో ఆఖరి మ్యాచ్ వర్షార్పణమైనా గ్రూప్ టాపర్ గా సూపర్- 8 రౌండ్ లోకి అడుగపెట్టింది. ఇప్పటివరకు అమెరికా పిచ్ లపై ఆడిన భారత జట్టు ఇకపై కరేబియన్ దీవులపై సత్తా చాటాల్సి ఉంది.

T20 World Cup 2024: సూపర్ 8కు ముందు టీమిండియాకు ఊహించని షాక్.. ప్రాక్టీస్‌లో స్టార్ ప్లేయర్‌కు గాయం
Team Inida
Follow us on

ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌కప్‌-2024 లో టీమిండియా అదరగొడుతోంది. గ్రూపు స్టేజిలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి అదరగొట్టింది. కెనడాతో ఆఖరి మ్యాచ్ వర్షార్పణమైనా గ్రూప్ టాపర్ గా సూపర్- 8 రౌండ్ లోకి అడుగపెట్టింది. ఇప్పటివరకు అమెరికా పిచ్ లపై ఆడిన భారత జట్టు ఇకపై కరేబియన్ దీవులపై సత్తా చాటాల్సి ఉంది. సూపర్-8 మ్యాచ్ ల కోసం ఇప్పటికే విండీస్ కు చేరుకుంది భారత జట్టు. ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. కాగా గ్రూప్ స్టేజ్ లోనే చూపిన జోరును సూపర్ – 8 లోనూ కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. సూపర్-8లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ లో జూన్‌ 20న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నెట్‌ ప్రాక్టీస్‌ లో గాయపడ్డాడని సమాచారం. ప్రాక్టీస్‌ చేస్తుండగా సూర్య చేతికి వేలికి తీవ్ర గాయమైందని సమాచారం. బంతి సూర్య కుడి చేతి వేలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది.

అయితే మ్యాజిక్ స్ప్రే చేసిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ తిరిగి మళ్లీ ప్రాక్టీస్‌ మొదలు పెట్టినట్లు స్పోర్ట్‌స్టాక్ తన నివేదికలో తెలిపింది. అయితే సూర్య గాయం తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. వరోవైపు మిస్టర్ 360 ప్లేయర్‌ గాయంపై అటు జట్టు మెనెజ్‌మెంట్‌ గానీఇటు బీసీసీఐ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ప్రపంచకప్ టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు సూర్య కుమార్ యాదవ్. అయితే అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఈ మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఒత్తిడిలో మంచి ఇన్నింగ్స్ ఆడి, హాఫ్ సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు.

ఇవి కూడా చదవండి

 

T20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 టీమిండియా సూపర్-8 పూర్తి షెడ్యూల్ ఇదే..

  • జూన్20: ఆఫ్ఘనిస్తాన్ vs ఇండియా (బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్)
  • జూన్ 22: ఇండియా vs బంగ్లాదేశ్  (నార్త్ సౌండ్, ఆంటిగ్వా జూన్)
  • జూన్ 24: ఆస్ట్రేలియా vs ఇండియా (గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా)

ప్రాక్టీస్ లో సూర్య కుమార్ యాదవ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..