T20 World Cup 2024: 64 బంతుల్లోనే సెంచరీ.. రషీద్‌ ఖాన్‌కు నిద్రపట్టకుండా చేస్తోన్న సూర్య

|

Jun 21, 2024 | 8:59 AM

టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్ 8లో భారత్ శుభారంభం చేసింది. లీగ్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై రోహిత్ సేన 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన అర్ధ సెంచరీతో చెలరేగాడు. అదే సమయంలో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన స్పిన్ మ్యాజిక్ తో టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశాడు

T20 World Cup 2024: 64 బంతుల్లోనే సెంచరీ.. రషీద్‌ ఖాన్‌కు నిద్రపట్టకుండా చేస్తోన్న సూర్య
Suryakumar Yadav
Follow us on

టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్ 8లో భారత్ శుభారంభం చేసింది. లీగ్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై రోహిత్ సేన 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన అర్ధ సెంచరీతో చెలరేగాడు. అదే సమయంలో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన స్పిన్ మ్యాజిక్ తో టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశాడు. ఈ మ్యాచ్ లో వేసిన నాలుగు ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు రషీద్ ఖాన్. అంతేకాదు కాదు రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే వికెట్లు తీశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్‌కు బౌలింగ్ చేసే సమయంలో మాత్రం రషీద్ ఖాన్ ఘోరంగా విఫలమయ్యాడు. రషీద్ ఖాన్ వేసిన ఓవర్ లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు సూర్య. ఇదిలా ఉంటే సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. అదేంటంటే.. టీ20 క్రికెట్​లో రషీద్ బౌలింగ్ లో ఒక్కసారి కూడా ఔట్ అవకుండా 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో బ్యాటర్ గా సూర్య నిలిచాడు. అతని కంటే ముందు డీఆర్సీ షార్ట్ (76 బంతుల్లో 113), షేన్ వాట్సన్ (73 బంతుల్లో 108) రషీద్ బౌలింగ్ లో 100 పరుగుల మార్కు​ను అందుకున్నారు. ఇప్పుడు సూర్య కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.

రషీద్ బౌలింగ్ లో 100 పరుగుల మార్కును చేరడానికి సూర్యకు కేవలం 64 బంతులే పట్టాయి. వరల్డ్ టాప్ బ్యాటర్లను సైతం తన స్పిన్ మాయాజాలతో వణికించే రషీద్.. టీ20 ఫార్మాట్​లో సూర్యను మాత్రం ఒక్కసారి కూడా ఔట్ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్ లోనూ రషీద్ పై ఆధిపత్యం చెలాయించాడు సూర్యకుమార్.

ఇవి కూడా చదవండి

అయితే మ్యాచ్ మాధ్యలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రషీద్ ఖాన్, సూర్య ఏదో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను అనేక రకాలుగా చిత్రీకరిస్తున్నారు. కొందరైతే మాటల తూటా అని పేర్కొన్నారు. మరికొందరు దీనిని స్నేహపూర్వక సంభాషణ అంటారు. భారత ఆటగాళ్లతో రషీద్ ఖాన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. దీనికి కారణం ఐపీఎల్. అందుకే వీరిద్దరూ స్నేహపూర్వకంగా మాట్లాడి ఉండొచ్చని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఫుల్ మ్యాచ్ హైలెట్స్ ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..