T20 WC 2024: సూపర్ 8 చేరిన 5 జట్లు.. 3 స్థానాల కోసం 6 టీంల పోరు.. టీ20 ప్రపంచకప్ నుంచి 6 జట్లు ఔట్..
T20 World Cup Super 8 Scenario: ఇప్పటివరకు మొత్తం 5 జట్లు సూపర్-8కి అర్హత సాధించాయి. టీమ్ ఇండియా గ్రూప్-ఏలో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత జట్టు వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సూపర్-8కి అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా జట్టు సూపర్-8కి దూసుకెళ్లింది. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్‌లు తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించాయి.

T20 World Cup Super 8 Scenario: టీ20 ప్రపంచ కప్ 2024 లో సూపర్-8కి వెళ్లే యుద్ధం రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు, సూపర్-8లో మొత్తం ఐదు జట్లు తమ స్థానాలను నిర్ధారించుకున్నాయి. రెండు పెద్ద జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కాగా, మిగిలిన మూడు స్థానాల కోసం చాలా పెద్ద జట్ల మధ్య పోటీ నెలకొంది. డెత్ గ్రూప్‌గా పరిగణించే గ్రూప్ డి పరిస్థితి చాలా ఆసక్తికరంగా మారింది.
సూపర్-8కి అర్హత సాధించిన జట్లు..
ఇప్పటివరకు మొత్తం 5 జట్లు సూపర్-8కి అర్హత సాధించాయి. టీమ్ ఇండియా గ్రూప్-ఏలో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత జట్టు వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సూపర్-8కి అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా జట్టు సూపర్-8కి దూసుకెళ్లింది. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్‌లు తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించాయి. పపువా న్యూ గినియాపై విజయం సాధించి ఆఫ్ఘనిస్తాన్ సూపర్-8కి అర్హత సాధించింది. కాగా, గ్రూప్-డి నుంచి దక్షిణాఫ్రికా సూపర్-8కి అర్హత సాధించింది.
NEW ZEALAND HAVE BEEN KNOCKED OUT OF THE 2024 T20 WORLD CUP.
– The tournament ends for Kane Williamson and his boys. 💔 pic.twitter.com/QWF0u4CRNq
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 14, 2024
టీ20 ప్రపంచకప్‌లో ముగిసిన 6 జట్ల ప్రయాణం..
ఇప్పటి వరకు 2024 టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 6 జట్లు నిష్క్రమించాయి. గ్రూప్ ఏ నుంచి అధికారికంగా ఏ జట్టు అనర్హత లిస్టులో చేరలేదు. కానీ, మిగిలిన మూడు గ్రూపుల నుంచి 6 జట్లు నిష్క్రమించాయి. గ్రూప్ బి నుంచి నమీబియా, ఒమన్ జట్లు నిష్క్రమించాయి. ఉగాండా, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్‌లు గ్రూప్ సి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. కివీస్ జట్టుకు ఇది పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ విజయంతో పపువా న్యూ గినియా ప్రయాణం T20 ప్రపంచ కప్‌లో ముగిసింది. గ్రూప్ డి నుంచి శ్రీలంక నిష్క్రమించింది.
మిగిలిన 3 స్థానాల కోసం ఈ జట్ల మధ్య పోరు..
సూపర్-8లో చోటు దక్కించుకోవడానికి ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం అమెరికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ వంటి జట్లు రేసులో ఉన్నాయి. గ్రూప్ డిలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ మధ్య పోరు సాగుతోంది. ఈ జట్లలో ఎవరైనా ముందుకు వెళ్లవచ్చు. అయితే, బంగ్లాదేశ్‌కు 3 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు ఉన్నందున అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెదర్లాండ్స్‌కు రెండు పాయింట్లు, నేపాల్‌కు 1 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
