Team India: రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్‌నకు కెప్టెన్‌గా హార్దిక్‌? ధృవీకరించిన స్టార్ స్పోర్ట్స్ పోస్టర్..

|

Jan 06, 2024 | 5:41 PM

T20 World Cup 2024: మరోవైపు, హార్దిక్ పాండ్యా ఇప్పటికీ పూర్తి ఫిట్‌గా లేడు. అతను జట్టులోకి తిరిగి రావడంపై ఎటువంటి అప్‌డేట్ లేదు. హార్దిక్ పాండ్యా గత ఏడాది కాలంగా టీ20 క్రికెట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పుడు గాయం కారణంగా హార్దిక్ జట్టుకు దూరమైనందున, జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడని భావిస్తున్నారు.

Team India: రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్‌నకు కెప్టెన్‌గా హార్దిక్‌? ధృవీకరించిన స్టార్ స్పోర్ట్స్ పోస్టర్..
T20 Worldcup 2024 India
Follow us on

T20 World Cup 2024: జనవరి 5న జరగనున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. దీంతో ఏ రోజు ఏ జట్టుతో ఏ జట్టు మ్యాచ్ జరుగుతుందో తేలిపోయింది. షెడ్యూల్ ప్రకారం, T20 ప్రపంచ కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది.

ఆ తర్వాత భారత్ తదుపరి మ్యాచ్ జూన్ 9న పాకిస్థాన్‌తో జరగనుంది. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ పోస్ట్‌ను విడుదల చేసింది. ఈ పోస్ట్‌లో ఇరు జట్ల కెప్టెన్‌లు ఉన్నారు. దీంతో పాటు టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్నకు కూడా సమాధానం దొరికినట్లేనని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

స్టార్ స్పోర్ట్స్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించి ఇరు జట్ల కెప్టెన్‌లతో కూడిన పోస్టర్‌ను షేర్ చేసింది. ఇందులో రోహిత్ శర్మకు బదులుగా హార్దిక్ పాండ్యాను భారత జట్టు కెప్టెన్‌గా చూపించారు.

ఈ పోస్ట్ బయటకు వచ్చిన తర్వాత, 2024 టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తాడని స్పష్టమైంది. అయితే, చాలా మంది నెటిజన్లు హార్దిక్ నాయకత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ శర్మనే సారథ్యం వహించాలని కోరుతున్నారు.

మరోవైపు, హార్దిక్ పాండ్యా ఇప్పటికీ పూర్తి ఫిట్‌గా లేడు. అతను జట్టులోకి తిరిగి రావడంపై ఎటువంటి అప్‌డేట్ లేదు. హార్దిక్ పాండ్యా గత ఏడాది కాలంగా టీ20 క్రికెట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పుడు గాయం కారణంగా హార్దిక్ జట్టుకు దూరమైనందున, జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడని భావిస్తున్నారు.

ఈసారి 2024 టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టీ20 ప్రపంచకప్‌ 2024లో టీమ్‌ ఇండియా గ్రూప్‌-ఎలో చేరింది. మొదటి గ్రూపులో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..