T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేది వీరే! వారి విషయంలో ఇంకా సందిగ్ధతే
India T20 WC Squad: ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్ కోసం జట్ల ప్రకటనకు ICC ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రతి బృందం సెప్టెంబర్ 15లోగా 15 మంది సభ్యుల జాబితాను సమర్పించాల్సి ఉంది.

India T20 WC Squad: ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్ కోసం జట్ల ప్రకటనకు ICC ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రతి బృందం సెప్టెంబర్ 15లోగా 15 మంది సభ్యుల జాబితాను సమర్పించాల్సి ఉంది. విశేషమేమిటంటే.. టీమిండియా తరఫున ఆడనున్న 13 మంది ఆటగాళ్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే 80 నుంచి 90 శాతం జట్టు కూర్పు పూర్తయిందని.. అయితే, పరిస్థితులను బట్టి మూడు, నాలుగు మార్పులు ఉండవచ్చని హిట్‌మ్యాన్ ఇటీవల చెప్పాడు. ఈక్రమంలో ప్రస్తుతం ఆసియా కప్‌లో ఆడుతున్న ఆటగాళ్లలో చాలామంది టీ20 ప్రపంచకప్‌లో కూడా కనిపించనున్నారు.
బుమ్రా, చాహల్ విషయంలో నో క్లారిటీ..
ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం..రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే గాయాలతో బాధపడుతోన్న జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఇద్దరు ఆటగాళ్లు రాబోయే సిరీస్‌లో ఆడతారో లేదో ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో ఈ ఇద్దరు పేసర్లు సత్తా చాటితేనే టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోగలరు.




రిజర్వ్ బెంచ్..
కాగాఆసియా కప్‌కు ఎంపిక కాని ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌లకు రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఆస్ట్రేలియన్ పిచ్‌పై ఆడిన అనుభవం ఉన్నందున, బీసీసీఐ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. కాగా పై జాబితాలో ఉన్న ఆటగాళ్లు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌లకు ఎంపిక కావడం దాదాపు ఖాయం. వీరిలో పేలవమైన ఫామ్‌ను కనబరిచే ఆటగాళ్లు చివరికి జట్టు నుంచి తొలగించవచ్చు. ఈ నేపథ్యంలో పరిస్థితులను బట్టి మూడు, నాలుగు మార్పులు ఉండవచ్చని రోహిత్ శర్మ చెప్పకనే చెప్పాడు. గాయం నుంచి కోలుకుంటే జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లు కూడా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకుంటారు. దీంతో15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఆస్ట్రేలియాకు పంపాలని భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..




