T20 World Cup: వావ్.. వాట్ ఏ క్యాచ్.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన లంక కెప్టెన్.. వైరలవుతోన్న వీడియో..!
మ్యాచ్‌లో శీలంక కెప్టెన్ దాసున్ శనక రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. రెండూ అద్భుతంగా ఉన్నాయి. ఇక రెండో క్యాచ్ అయితే వర్ణించడానికి మాటలు చాలవు. వావ్ అంటూ స్టేడియంలోని జనాలు కూడా ఆశ్చర్యపోయారు.
Dasun Shanaka: క్యాచస్ విన్ మ్యాచస్. ఈ సామెత క్రికెట్‌లో ఎప్పటి నుంచో ఉంది. తాజాగా శ్రీలంక ఈ నానుడిని నిజం చేసింది. నమీబియాతో జరిగిన తన మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో క్యాచులు పట్టి మ్యాచును గెలుచుకుంది. శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక పట్టిన ఓ క్యాచ్ నెట్టింట్లోనూ వైరల్‌గా మారింది. నిజంగా అద్భుతమంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ స్టన్నింగ్ క్యాచు చూసిన ప్రేక్షకులు కూడా వావ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మ్యాచ్‌లో శంక రెండు క్యాచ్‌లు తీసుకున్నాడు. రెండూ అద్భుతంగా అందుకున్నవే.
నమీబియా ఇన్నింగ్స్ 19 వ ఓవర్‌లో శనక ఈ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. శ్రీలంక బౌలర్ చమీరా వేసిన బంతిని నమీబియా బ్యాట్స్‌మన్ రూబెన్ భారీ షాట్ ఆడబోయాడు. కానీ, మిస్ అవ్వడంతో బ్యాడ్ ఎడ్జ్‌లో తగిలి గాల్లోకి లేచింది. బంతి బౌలర్ వైపు గాలిలోకి వెళ్లింది. అయితే ఈ క్యాచ్‌ను బౌలర్ పట్టుకోలేడని గ్రహించిన చమీరా ఆగిపోయాడు. ఇంతలో లంక కెప్టెన్ దాసున్ శనక మాత్రం వదిలిపెట్టలేదు. చమీరా అసాధ్యమని వదిలిపెట్టిన క్యాచ్‌ను ఔరా అనిపించి సుసాధ్యం చేశాడు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన లంక కెప్టెన్ బంతి నేలను తాకబోతున్న క్షణంలో శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక ఒంట చేత్తో ఒడిసి పట్టాడు. ఈ దృశ్యాన్ని చూసి స్టేడియంలో కూర్చున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. ఇది ఎలా జరిగింది? అంటూ మాట్లాడుకున్నారు.
శనక క్యాచ్, శ్రీలంక మ్యాచ్ గెలిచింది ఈ మ్యాచ్‌లో దాసున్ శంక పట్టుకున్న రెండో క్యాచ్ ఇది. ఈ అద్భుతమైన క్యాచ్ ముందు అతను నమీబియా ఓపెనర్ జేన్ గ్రీన్ క్యాచ్ పట్టుకున్నాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 39 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట ఆడిన నమీబియా జట్టు పూర్తి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 19.3 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక తరఫున మహిష్ టిక్సానా 3 వికెట్లు తీశాడు. వనిందు, లహిరు కుమార తలో 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక 13.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టపోయి విజయం సాధించింది. శ్రీలంక తరఫున రాజపక్స 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. అవిష్క ఫెర్నాండో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
View this post on Instagram