PAK vs NAM, T20 World Cup, LIVE Streaming: ఫుల్ జోష్‌లో పాకిస్తాన్.. బాబర్ సేన ధాటికి నమీబియా నిలిచేనా?
భారత్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లను పాకిస్తాన్ ఓడించింది. ఇప్పుడు సెమీఫైనల్‌కు చేరువలో నిలిచింది.
T20 World Cup 2021, PAK vs NAM: వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఉత్సాహంగాతో పాకిస్థాన్ జట్టు మంగళవారం నమీబియాపై అద్భుత ప్రదర్శనను కొనసాగించి, టీ20 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించే తొలి జట్టుగా నిలిచేందుకు ఎదురుచూస్తోంది. ప్రపంచకప్‌కు ముందు పాక్ జట్టు ఎంతో నిరాశకు గురైంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్నాయి. అయితే బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్‌లో ఎన్ని ప్రతికూలతలను ఎదుర్కొన్నా మంచి ప్రదర్శన కనబరిచింది. భారత్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లను పాకిస్తాన్ ఓడించింది.
వరుసగా మూడు విజయాలు సాధించిన పాకిస్తాన్ టీంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఈమేరకు పాక్ సీనియర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ సోమవారం మాట్లాడుతూ, “నిజం చెప్పాలంటే, టోర్నమెంట్‌లో పెద్ద జట్టుతో తలపడిన తరువాత, ఆ మ్యాచ్‌లో గెలిస్తే, డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది” అని మాలిక్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. ‘మాకు లయ దొరికింది. తొలి మ్యాచ్‌లో ప్రతి జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసి లయను అందుకోవాలనే ఉద్దేశ్యంతో బరిలోకి దిగుతుంది’ అని ఆయన తెలిపాడు. మునుపటి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఓడిపోయిన నమీబియాకు ఇది పెద్ద మ్యాచ్ అవుతుంది. అగ్రశ్రేణి జట్టుకు కఠినమైన సవాలును ఇచ్చేందుకు వారు ప్రయత్నిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌పై నమీబియా ఆరు వికెట్లను ఫాస్ట్ బౌలర్లు తీశారు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ దాడి చాలా బలంగా ఉంది. ఇది ఖచ్చితంగా నమీబియాకు ఆందోళన కలిగించే అంశం.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ vs నమీబియా మధ్య మ్యాచ్ ఎప్పుడు జరగనుంది?
నవంబర్ 2న (మంగళవారం) పాకిస్థాన్ vs నమీబియా మధ్య మ్యాచ్ జరగనుంది.
పాకిస్థాన్ vs నమీబియా మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో పాకిస్థాన్ vs నమీబియా మధ్య మ్యాచ్ జరగనుంది.
పాకిస్థాన్ vs నమీబియా మధ్య మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
పాకిస్థాన్ vs నమీబియా మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు టాస్ ఉంటుంది.
పాకిస్థాన్ vs నమీబియా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడవచ్చు?
పాకిస్థాన్ vs నమీబియా మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు.
ఆన్‌లైన్‌లో పాకిస్థాన్ vs నమీబియా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
లైవ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో డిస్నీ+హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. అలాగే మ్యాచ్ లైవ్ అప్ డేట్స్‌ను tv9telugu.comలో చదవవచ్చు.
PAK vs NAM హెడ్ టు హెడ్: పాకిస్థాన్ టీం అంతర్జాతీయ మ్యాచ్‌లో నమీబియాతో ఆడడం ఇది రెండోసారి మాత్రమే. 2003 ప్రపంచ కప్‌లో ఓసారి తలపడ్డాయి. ఇందులో పాకిస్తాన్ టీం 171 పరుగులతో గెలిచింది.
పాకిస్తాన్ ప్లేయింగ్ XI అంచనా: మహ్మద్ రిజ్వాన్ (కీపర్), బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వాసిమ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్
నమీబియా ప్లేయింగ్ XI అంచనా: స్టీఫన్ బార్డ్, జేన్ గ్రీన్ (కీపర్), క్రెయిగ్ విలియమ్స్, గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), డేవిడ్ వైస్, జేజే స్మిట్, మైఖేల్ వాన్ లింగెన్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్