Ban Pak Cricket: పాక్‌తో మ్యాచ్ ఆడొద్దు.. క్రికెట్‌ నుంచి ఆ జట్టును బ్యాన్ చేయండి: ట్విట్టర్‌లో పెరుగుతోన్న డిమాండ్లు.. ఎందుకో తెలుసా?

|

Oct 17, 2021 | 8:27 PM

T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 24న హై ఓల్టేజ్ మ్యాచ్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అదే భారత్ వర్సెస్ పాకిస్తాన్ (Ind vs Pak) మ్యాచ్. దాయాదులు మెగా టోర్నీలో ఇదే మ్యాచ్‌తో తమ ప్రయాణాలను మొదలుపెట్టనున్నాయి.

Ban Pak Cricket: పాక్‌తో మ్యాచ్ ఆడొద్దు.. క్రికెట్‌ నుంచి ఆ జట్టును బ్యాన్ చేయండి: ట్విట్టర్‌లో పెరుగుతోన్న డిమాండ్లు.. ఎందుకో తెలుసా?
Ban Pak Cricket
Follow us on

Ban Pak Cricket: క్రికెట్ ప్రేమికలు ఎదురు చూస్తున్న హై ఓల్టెజ్ మ్యాచ్ టీ 20 ప్రపంచ కప్ 2021(T20 World Cup 2021)లో ఈనెల 24 న జరగనుంది. అదే భారత్ వర్సెస్ పాకిస్తాన్ (Ind vs Pak) మ్యాచ్. దాయాదులు మెగా టోర్నీలో ఇదే మ్యాచ్‌తో తమ ప్రయాణాలను మొదలుపెట్టనున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఈ మ్యాచ్‌ నెట్టింట్లో ఏదో ఒక టాపిక్‌తో చర్చ నడుస్తూనే ఉంది. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య మ్యాచ్ జరగక చాలా ఏళ్లైంది. దీంతో ఇరుజట్లు ఐసీసీ ఈవెంట్లో తలపడుతుండడంతో అటు మాజీలు, ఇటు అభిమానులు ఏదో రకంగా భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌ను నెట్టింట్లో వైరల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఈ మ్యాచ్‌పై నెట్టింట్లో హాట్ టాపిట్ నడుస్తోంది. దీంతో ఈ మ్యాచ్ పై నీలీనీడలు కమ్ముకునేలా చర్చలు నడుస్తున్నాయి. అసలే జరిగిందంటే.. శ్రీనగర్‌లో ఉగ్రదాడులు జరగడంతో భారతదేశ ప్రజలు బాగా కోపంతో ఉన్నారు. గత 24 గంటల్లో అక్కడ సుమారు 9 ఎన్‌కౌంటర్లు జరగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడుల్లో ఓ వ్యాపారితోపాటు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే భారత సైన్యం 13 మంది టెర్రరిస్టులను హతం చేసినట్లు పేర్కొంది. ఈ విషయంతోనే భారత ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు.

ఈ మేరకు #ban_pak_cricket హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తూ తమ కోపాన్ని చూపిస్తున్నారు. ఈనెల 24న టీ20 ప్రపంచ కప్‌లో జరిగే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచును రద్దు చేయాలిన డిమాండ్ చేస్తున్నారు. పాక్ టెర్రరిస్టులు భారతదేశంపై దాడులు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తుందని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా లెక్కచేయకుండా అనేకసార్లు సరిహద్దుల్లో దాడులు చేస్తుందని, అలాంటి టీంతో క్రికెట్ ఆడడం ఎలా సాధ్యమంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాక్‌తో మ్యాచ్ ఆడకుండా ఉండాలంటూ డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. మహా అయితే రెండు పాయింట్లు పోతాయేమో, కానీ, ఇక్కడ భారత ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దంటూ బీసీసీఐ, క్రికెటర్లను ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

అలాగే టెర్రరిస్టులో సహవాసం చేస్తూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను అసలు క్రికెట్‌ నుంచే బ్యాన్ చేయాలంటూ ఐసీసీని కోరుతున్నారు. మరోవైపు కొంతమంది మాత్రం పాకిస్తాన్ తో మ్యాచ్‌ను ఆడి, చిత్తుగా ఓడించి తగిన బుద్ది చెప్పాలంటే కోరుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఇరు దేశాల అభిమానులు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ బూతులు తిట్టుకుంటున్నారు. ఇది చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి.

Also Read: T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌ ఫుల్ టైం టేబుల్, మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలు మీకోసం..!

T20 World Cup: తొలిసారి ప్రపంచకప్‌ బరిలో 7గురు భారత ఆటగాళ్లు.. పాకిస్తాన్ మ్యాచుతో 4గురి ప్రయాణం మొదలు.. వారెవరంటే?