IND vs NZ : అహ్మదాబాద్‌లో భారత్-న్యూజిలాండ్ యుద్ధం.. ఫైనల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచే ఆటగాళ్లు వీరే

IND vs NZ : టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తరమైన ముగింపునకు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉన్న భారత్, పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడే న్యూజిలాండ్ మధ్య ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ పోరు జరగనుంది. ఈ మెగా ఫైట్‌లో గెలిచేది ఎవరు?

IND vs NZ : అహ్మదాబాద్‌లో భారత్-న్యూజిలాండ్ యుద్ధం.. ఫైనల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచే ఆటగాళ్లు వీరే
Ind Vs Nz

Updated on: Mar 08, 2026 | 10:31 AM

IND vs NZ : టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తరమైన ముగింపునకు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉన్న భారత్, పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడే న్యూజిలాండ్ మధ్య ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ పోరు జరగనుంది. ఈ మెగా ఫైట్‌లో గెలిచేది ఎవరు? ఏ అంశాలు ప్రభావం చూపనున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రౌండ్ రిపోర్ట్ నుంచి ప్లేయింగ్ ఎలెవన్ వరకు ఉన్న పూర్తి విశ్లేషణ ఇక్కడ ఉంది.

భారత్ ప్లస్ పాయింట్లు.. మైనస్ పాయింట్లు:

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ అద్భుతంగా ఆడుతున్నా, ఇద్దరు కీలక ఆటగాళ్ల ఫామ్ మాత్రం కలవరపెడుతోంది. ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మ ఎనిమిది మ్యాచుల్లో కేవలం 89 పరుగులే చేయడం మైనస్‌గా మారింది. అలాగే వరల్డ్ నంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తి సెమీఫైనల్‌లో 64 పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, సంజూ శాంసన్ ఆడుతున్న సూపర్ ఇన్నింగ్స్ (సెమీస్‌లో 89 పరుగులు) భారత్‌ను కాపాడుతోంది. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా తన యార్కర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు.

కివీస్ వ్యూహాలు – ఓపెనర్ల విధ్వంసం:

మిచెల్ శాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ ప్రధాన బలం. వీరిద్దరినీ పవర్ ప్లేలోనే అవుట్ చేయకపోతే భారత బౌలర్లకు నరకమే. కివీస్ మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా ఉన్నందున, బుమ్రాను ఆదిలోనే ప్రయోగించాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఇక బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర తన స్పిన్‌తో వికెట్లు తీస్తూ కివీస్‌కు ఆయుధంగా మారాడు.

అహ్మదాబాద్ పిచ్ – డ్యూ ఫ్యాక్టర్:

నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ ఎరుపు, నలుపు మట్టి కలయికతో తయారైంది. ఇది బ్యాటర్లకు స్వర్గధామంలా ఉండబోతోంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, రాత్రిపూట వచ్చే మంచు ఫ్యాక్టర్ కీలకం కానుంది. 2024 నుంచి ఇక్కడ ఛేజింగ్ చేసిన జట్లే ఎక్కువసార్లు (5-3) గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

ముఖాముఖి పోరు – సెంటిమెంట్లు:

ఓవరాల్‌గా టీ20ల్లో భారత్ 16-11తో ఆధిక్యంలో ఉంది. కానీ, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్‌ను భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడించలేదు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ కివీస్‌దే విజయం. ఈ సారి ఆ పీడకలను చెరిపేసి భారత్ కప్పు గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. బుమ్రా వేసే యార్కర్లు, డారిల్ మిచెల్ ఆడే షాట్ల మధ్య జరిగే పోరు ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us