Video: చివరి బంతికి 3 పరుగులు.. కట్‌చేస్తే.. బౌండరీ లైన్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. మ్యాచ్ అంటే ఇదేనంటూ నెటిజన్ల కామెంట్స్.. వీడియో..
T20 Blast 2023: చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించడంతో.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రిస్ జోర్డాన్ అతను చేసిన ప్రయత్నాన్ని చాలా మంది ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
T20 Blast 2023: ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లీగ్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సర్రే, ఎసెక్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సర్రేకు సునీల్ నరైన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన నరైన్ కేవలం 37 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 78 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ అజేయ అర్ధ సెంచరీతో సర్రే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
196 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన ఎసెక్స్ జట్టులో డేనియల్ లారెన్స్ 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన కైల్ పెప్పర్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనతో బౌలర్లను చిత్తు చేశాడు. వేగంగా బ్యాటింగ్ చేసిన పెప్పర్ 39 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 75 పరుగులతో విధ్వంసం చేశాడు.
మరోవైపు ఫిరోజ్ ఖుషీ కూడా అద్భుతమైన బ్యాటింగ్ కనబరిచాడు. ఫలితంగా చివరి ఓవర్‌లో ఎసెక్స్ జట్టు విజయానికి 8 పరుగులు కావాల్సి వచ్చింది. తొలి 5 బంతుల్లో ఒక్కో పరుగు వచ్చింది. దీంతో ఎసెక్స్ టీం చివరి బంతికి 3 పరుగులు చేయాల్సి వచ్చింది.
ఈ దశలో షాన్ అబాట్ వేసిన చివరి బంతిని డీప్ మిడ్ వికెట్‌కు తరలించిన ఫిరోజ్ ఖుషీ.. సిక్స్ లేదా ఫోన్ పోతుందని అనుకున్నాడు. కానీ, బౌండరీ వద్ద ఫీల్డిండ్ చేస్తున్న క్రిస్ జోర్డాన్ వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని క్యాచ్ పట్టాడు. కానీ, అదే వేగంతో బౌండరీ లైన్ దాటాడు. ఈ క్రమంలో బంతిని గ్రౌండ్‌లోకి విసిరేసేందుకు ప్రయత్నించాడు. కానీ, స్పీడ్ కంట్రోల్ చేసే క్రమంలో బంతిని మైదానంలోకి విసిరలేకపోయాడు. జోర్డాన్‌తోపాటు బంతి కూడా బౌండరీ దాటింది. దీంతో చివరి బంతికి వికెట్ పడాల్సిన చోట.. ఎసెక్స్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది.
WHAT A FINISH 🤯
Feroze Khushi’s big hit is caught brilliantly on the boundary, but can’t be kept in the field, and Essex win!#Blast23 pic.twitter.com/03ifEb7dSL
— Vitality Blast (@VitalityBlast) July 2, 2023
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రిస్ జోర్డాన్ చేసిన రిస్క్ ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, జోర్డాన్ చేసిన ప్రయత్యాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..