India vs Oman Asia Cup:  టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. ఒమన్‌పై కొత్త చరిత్ర సృష్టిస్తుందా?

ఈరోజు ఆసియా కప్‌లో ఒమాన్‌తో జరగనున్న మ్యాచ్‌తో టీమిండియా 250వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. భారత జట్టు ఈ స్టేడియంలో తక్కువ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, వారి ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో వారికి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు.

India vs Oman Asia Cup:  టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. ఒమన్‌పై కొత్త చరిత్ర సృష్టిస్తుందా?
India Vs Oman Asia Cup

Updated on: Sep 19, 2025 | 7:42 PM

India vs Oman Asia Cup:  ఆసియా కప్ 2025లో భాగంగా ఇండియా, ఒమన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

భారత్‌కు 250వ టీ20 మ్యాచ్‌

ఈ మ్యాచ్ భారత్‌కు చాలా స్పెషల్. టీమిండియా ఆడుతున్న 250వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఇది. ఈ ఘనత సాధించిన రెండో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటివరకు పాకిస్తాన్ మాత్రమే అత్యధికంగా టీ20 మ్యాచ్‌లు ఆడింది. అబుదాబిలోని ఈ స్టేడియంలో టీమిండియా చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడింది. కానీ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే, ఈ మ్యాచ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

తొలిసారి ముఖాముఖి

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టీ20 ఫార్మాట్‌లో ఇండియా, ఒమన్ తలపడటం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ ఫలితం టోర్నమెంట్‌లో ఎలాంటి ప్రభావం చూపదు, ఎందుకంటే గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్ ఇప్పటికే సూపర్-4కు అర్హత సాధించాయి. అయినప్పటికీ, రెండు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరచాలని చూస్తున్నాయి. ముఖ్యంగా ఒమన్ జట్టు, కనీసం ఒక్క విజయం సాధించి టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లాలని ఆశిస్తోంది.

ఇరు జట్ల స్క్వాడ్స్

టీమ్ ఇండియా స్క్వాడ్:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.

ఒమన్ స్క్వాడ్:

జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సూఫ్యాన్ యూసుఫ్, ఆశిష్ ఒడేదరా, ఆమిర్ కలీం, మహమ్మద్ నదీమ్, సూఫ్యాన్ మెహమూద్, ఆర్యన్ బిస్ట్, కరణ్ సోనవాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, ముహమ్మద్ ఇమ్రాన్, నదీమ్ ఖాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..