India vs England T20 Series: ఇంగ్లాండ్​తో జరిగే తొలి టీ20లో అరంగేట్రం చేయనున్న సూర్యకుమార్ యాదవ్..!

Ind vs Eng: ఇంగ్లాండ్​తో జరిగే తొలి టీ20లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. సాహిల్‌ఖాన్‌ అనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఇన్​స్టాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు చర్చకు దారి తీసింది. టీమిండియా తరఫున ఆడాలనే..

India vs England T20 Series: ఇంగ్లాండ్​తో జరిగే తొలి టీ20లో అరంగేట్రం చేయనున్న సూర్యకుమార్ యాదవ్..!
సూర్యకుమార్ యాదవ్
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 12, 2021 | 2:56 PM

Suryakumar Yadav : ఐపీఎల్-13లో దుమ్మురేపిన ముంబై ఇండియన్ యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ గుర్తున్నాడుగా.. అయితే ఇప్పుడు ఈ యువ కెరటం తొలి సారి టీమిండియా తర్వాత ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఇంగ్లాండ్​తో జరిగే తొలి టీ20లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. సాహిల్‌ఖాన్‌ అనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఇన్​స్టాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు చర్చకు దారి తీసింది. టీమిండియా తరఫున ఆడాలనే కోరిక ఇంగ్లాండ్‌తో నేడు జరగబోయే తొలి టీ20తో నిజమయ్యే అవకాశం ఉంది. గత మూడేళ్లుగా దేశవాళీ, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన సూర్యకుమార్‌కు బీసీసీఐ నుంచి పిలుపురాలేదు.

గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేస్తారని భావించినా అది ఫలించలేదు. దీంతో నిరాశకు గురికాకుండా మరింత జోష్‌తో ఐపీఎల్-13లో చెలరేగి ఆడాడు. దీంతో తాజాగా ఇంగ్లాండ్‌తో పొట్టి సిరీస్‌కు ఎంపికయ్యాడు.

సూర్య తొలి టీ20లోనే డబౌట్ మ్యాచ్ కానుందనే ప్రచారం సాగుతోంది. సూర్యకుమార్‌ పరోక్షంగా తెలిపాడు. సాహిల్‌ఖాన్‌ అనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సూర్య తొలి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేస్తున్నాడు. అతడికి శుభాకాంక్షలు’ అంటూ పోస్టు పెట్టాడు. దానికి స్పందించిన సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఆ పోస్టును పంచుకొని అవునని అర్థం వచ్చేలా వివరించాడు. దీంతో ఇంగ్లాండ్‌తో నేడు జరిగే తొలి టీ20లోనే ఈ ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ బరిలోకి దిగేఅవకాశం ఉందని అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి :

Breaking News: పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద అగ్నిప్రమాదం.. పిల్లర్లకు అంటుకున్న మంటలు.. దట్టంగా వ్యాపించిన పొగ

Mithali Raj 10000 Rus: క్రికెట్ ఫ్యాన్స్ అదిరిపోయే ప్రపంచ రికార్డు.. మిథాలీ రాజ్ పది వేల పరుగులు

MS Dhoni Has Hit in Nets: ధోనీ సిక్సర్ల మోత.. ప్రాక్టీస్‌‌లో దుమ్మురేపుతున్న వీడియో వైరల్