Suresh Raina: రిటైర్మెంట్‌ తీసుకున్నా రైనాలో తగ్గని జోరు.. చిరుత కంటే వేగంగా డైవ్‌.. కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌

|

Sep 29, 2022 | 11:49 AM

మైదానంలో చిరుతలా చురుకుగా కదిలే రైనా ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత చాలాకాలంగా మైదానానికి దూరంగా ఉన్నప్పటికీ అతనిలో ఆ చురుకుదనం ఇంకా తగ్గలేదు.

Suresh Raina: రిటైర్మెంట్‌ తీసుకున్నా రైనాలో తగ్గని జోరు.. చిరుత కంటే వేగంగా డైవ్‌.. కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌
Suresh Raina
Follow us on

రెండేళ్ల క్రితం ఎంఎస్ ధోనీతో కలిసి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు సురేశ్ రైనా . ఇక కొద్ది రోజుల క్రితం ఐపీఎల్‌తో పాటు అన్ని ఫార్మాట్లకు కూడా వీడ్కోలు చెప్పి క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడీ మిస్టర్‌ ఐపీఎల్‌. ఇక మైదానంలో రైనాను చూడలేమన్న అభిమానులకు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ రూపంలో మంచి అవకాశం వచ్చింది. మైదానంలో చిరుతలా చురుకుగా కదిలే రైనా ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలాకాలంగా మైదానానికి దూరంగా ఉన్నప్పటికీ అతనిలో ఆ చురుకుదనం ఇంకా తగ్గలేదు. గతంలో మెరుపు ఫీల్డింగ్‌తో ఎన్నో అద్భుత క్యాచ్‌లు అందుకున్న ఈ సొగసరి ప్లేయర్‌ తాజాగా మరోసారి తన ఫీల్డింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో గాలిలోకి దూకి మరీ క్యాచ్‌ పట్టాడీ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 లో భాగంగా రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి (సెప్టెంబర్ 28) ఇండియా లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్ మధ్య మొదటి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. కాగా ఈ మ్యాచ్‌లో బెన్ డంక్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా లెజెండ్స్‌ 16వ ఓవర్‌లో అభిమన్యు మిథున్ బంతిని తీసుకున్నాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయి భారీ షాట్లతో విరుచుకుపడుతున్న బెన్‌ డంక్‌ ఆఫ్‌ సైడ్ కట్‌ షాట్‌ ఆడాడు. ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తోన్న రైనా కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. పక్కకు జంప్‌ చేస్తూ అతను బంతిని అందుకున్న తీరు డంక్‌తో పాటు అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ క్యాచ్‌ పట్టిన తర్వాత తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు రైనా. కాగా ఈ క్యాచ్‌ పట్టేసమయంలో తన వేళ్లకు గాయమైనట్లు తెలిసింది. దీంతో కాసేపు అసౌకర్యంగా కనిపించాడీ మిస్టర్ ఐపీఎల్‌.

ఇవి కూడా చదవండి

కాగా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా లెజెండ్ తరఫున డంక్ కాకుండా , అలెక్స్ 31 బంతుల్లో 35 పరుగులు మరియు కెప్టెన్ షేన్ వాట్సన్ 21 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అభిమన్యు మిథున్ 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. వర్షం అంతరాయం కలగడంతో మ్యాచ్‌ నేటికి వాయిదా పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..