Mr IPL Suresh Raina: ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ ప్లేయర్ భారత్ తరఫున మొదటి టీ20 సెంచరీని చేసాడని మీకు తెలుసా..? అతనెవరో తెలుసుకోండి..

|

Nov 27, 2022 | 6:56 AM

టీ20లో ఫార్మాట్‌లోని ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లను లెక్కిస్తే అందులో సురేష్ రైనా పేరు తప్పక వస్తుంది. ఈ బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి ఐపీఎల్ వరకు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో తనదైన ముద్ర వేశాడు ఈ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్. రైనాను..

Mr IPL Suresh Raina: ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ ప్లేయర్ భారత్ తరఫున మొదటి టీ20 సెంచరీని చేసాడని మీకు తెలుసా..? అతనెవరో తెలుసుకోండి..
Suresh Raina
Follow us on

టీ20లో ఫార్మాట్‌లోని ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లను లెక్కిస్తే అందులో సురేష్ రైనా పేరు తప్పక వస్తుంది. ఈ బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి ఐపీఎల్ వరకు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో తనదైన ముద్ర వేశాడు ఈ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్. రైనాను ‘మిస్టర్ ఐపీఎల్’ అని కూడా పిలుస్తారంటే ఐపీఎల్‌లో అతని ఆధిపత్యాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో భారత జట్టు తరఫున విజయవంతంగా రాణించిన రైనా  టెస్ట్‌లలో గొప్ప ఆరంభం తర్వాత కొంత విఫలమయ్యాడు. ఇంతకీ ఇప్పుడు రైనా గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ రోజు (నవంబర్ 27) మిస్టర్ ఐపీఎల్ 36వ పుట్టినరోజు. అంతర్జాతీయ వన్డేలు, టీ20 ఫార్మాట్‌లలో రాణించిన ఈ మాజీ టీమ్‌ఇండియా ప్లేయర్ టెస్ట్‌ల్లో తన మెరుపును ప్రదర్శించలేకపోయాడు. ధోని సారథ్యంలో భారత్  2011లో వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు, రైనా జట్టులో సభ్యుడు. యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలతో కలిసి భారత్‌ను ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. భారత్ తరఫున టీ20లో తొలి సెంచరీ  చేసిన బ్యాట్స్‌మెన్‌గా రైనా రికార్డుల్లో నిలిచాడు. అది కూడా 2010లో వెస్టిండీస్‌లో ఆడిన టీ20 ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించాడు అతను.

టెస్టుల్లో వైఫల్యం..

టీ20, వన్డేల్లో టీమిండియా మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు రైనా చేసిన కృషి టెస్టుల్లో చేయలేకపోయాడు. అయితే రైనా టెస్ట్ ఫార్మాట్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. 2010లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టులో రైనా అరంగేట్రం చేసి.. తొలి టెస్టు మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 120 పరుగుల ఇన్నింగ్స్ ఆడి, భారత తరఫున అరంగేట్రం టెస్టులో సెంచరీ చేసిన 12వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అయితే ఇంత గొప్ప ఆరంభం తర్వాత కూడా అతను టీమ్ ఇండియాకు టెస్టుల్లో పెద్దగా ఆడలేకపోయాడు. 2011లో టీమ్ ఇండియా ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు, రైనా కూడా టెస్టు జట్టులో సభ్యుడు. అక్కడ అతను చాలా మ్యాచ్‌లు ఆడాడు కానీ వాటిల్లో విఫలమయడమే.. టెస్టులకు అతను దూరంగా ఉండటానికి ప్రధాన కారణంగా మారింది. టెస్టుల్లో భారత్ తరఫున 18 మ్యాచ్‌లు ఆడిన రైనా 768 పరుగులు చేశాడు. ఈ 18 మ్యాచ్‌లలో అతను ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు చేశాడు.

వన్డేలు, టీ20ల్లో సత్తా..

రైనా టెస్టుల్లో టీమ్ ఇండియాకు పెద్దగా ఆడలేదు కానీ టీ20, వన్డేల్లో టీమ్ ఇండియాకు ప్రాణంగా నిలిచాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌ శైలితో భారత్‌ను ఎన్నో మ్యాచ్‌లలో గెలిపించాడు. రైనాకు చివరి ఓవర్లలో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించేది. దాంతో అప్పటికే ప్రషర్ మీద ఉండే ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేసేవాడు. 

ఇవి కూడా చదవండి

మిస్టర్ ఐపీఎల్..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రైనా వెన్నెముకలాంటి ప్లేయర్. మూడో స్థానంలో భ్యాటింగ్‌కు దిగే రైనా ప్రత్యర్థి బౌలర్లపై ఇష్టానుసారంగా తన బ్యాట్‌తో దాడి చేసేవాడు. అతన్ని ‘మిస్టర్ ఐపీఎల్’ అనడానికి ఇది కూడా ఒక కారణం. ఇంకా చెన్నై ఐపీఎల్ టీమ్ అభిమానులు అతన్ని చిన్న తలా( చిన్న నాయకుడు) అని కూడా ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటుంటారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడైన రైనా  జట్టుకు అవసరమైన సమయాల్లో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. ఐపీఎల్ జరిగిన అన్ని సీజన్లలో చెన్నై టీమ్ తరఫునే ఆడాడు రైనా. అయితే 2015 సీజన్ తర్వాత ఆ టీమ్ రెండేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నప్పుడు, అతను తాత్కాలికంగా గుజరాత్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. నిషేధం నుంచి చెన్నై జట్టు తిరిగి టోర్నమెంట్‌లోకి వచ్చినప్పుడు, చైన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసిన ముగ్గురు ఆటగాళ్లలో అతను ఒకడు. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 205 మ్యాచ్‌లను ఆడని రైనా 200 ఇన్నింగ్స్‌లలో 5528 పరుగులను చేశాడు. ఇంకా అందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉండడమే కాక అతని స్ట్రైక్ రేట్ 136.73 ఉండడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..