IPL 2026: కావ్య పాప పెద్ద స్కెచే.! రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే

ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. బలంగా ఉన్న బ్యాటింగ్ లైనప్‌తో పాటు నాణ్యమైన భారతీయ స్పిన్నర్, లోయర్ ఆర్డర్ ఫినిషర్, విదేశీ ఆల్-రౌండర్‌పై వేలంలో దృష్టి సారించనుంది SRH.

IPL 2026: కావ్య పాప పెద్ద స్కెచే.! రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
Srh

Updated on: Dec 12, 2025 | 9:13 AM

ఐపీఎల్ 2026 మినీ వేలానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న SRH, జట్టు కూర్పును పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుత జట్టులో బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇక మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్‌ ఉండనే ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండీస్ వంటి ఆటగాళ్లు కూడా బ్యాటింగ్ లైనప్‌కు బలాన్ని చేకూరుస్తున్నారు.

ఫాస్ట్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, పాట్ కమిన్స్ దుమ్ములేపుతున్నారు. ఒక ఫైర్ పవర్ ఉన్న ఓపెనింగ్ బౌలర్ మాత్రమే లోటుగా కనిపిస్తోంది. అలాగే, రషీద్ ఖాన్ నిష్క్రమణ తర్వాత స్పిన్ డిపార్ట్‌మెంట్ బలహీనంగా ఉంది. SRH పర్స్ విలువ రూ. 25.50 కోట్లుగా ఉంది. దీంతో జట్టుకు కావాల్సిన ప్లేయర్స్‌ను తీసుకోవాలని కావ్య పాప స్కెచ్ వేస్తోంది. మరి జట్టు దృష్టి సారించనున్న ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూసేద్దాం..

మతీశ పతిరానా: చెన్నై సూపర్ కింగ్స్ నుంచి విడుదలైన ఈ యార్కర్ స్పెషలిస్ట్ డెత్ ఓవర్లలో రన్స్ కట్టడి చేయగలడు. చివరి ఓవర్లలో పరుగులు ధారాళంగా ఇవ్వకుండా.. కీలకమైన వికెట్లు పడగొడతాడు.

ఇవి కూడా చదవండి

మాట్ హెన్రీ: న్యూజిలాండ్‌కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ SRHకి అవసరమైన ఓపెనింగ్ బౌలర్ లోటును తీర్చగలడు. అతడి ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఆకాష్ మధ్వాల్: దేశీయ క్రికెట్‌లో మంచి ఫాస్ట్ బౌలర్‌గా పేరున్న ఆకాష్ మధ్వాల్ వేలంలో తక్కువ ధరకు దొరుకుతాడు. ఇది SRHకి అనుకూలంగా మారుతుంది.

కామెరూన్ గ్రీన్: మంచి ఆల్-రౌండర్‌గా, లోయర్ ఆర్డర్‌లో మంచి హిట్టర్, అలాగే ఓపెనింగ్ ఫాస్ట్ బౌలర్‌గా కూడా గ్రీన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అతడి కోసం కెప్టెన్, కోచ్‌ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

రవి బిష్ణోయ్: రషీద్ ఖాన్ వెళ్లిపోయిన తర్వాత SRH స్పిన్ విభాగం బలహీనంగా ఉంది. రవి బిష్ణోయ్ అందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అతడు సుమారు రూ. 10 కోట్ల వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

మొత్తంగా చూసుకుంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్, ఒక దేశీయ స్పిన్నర్, ఓవర్సీస్ ఆల్-రౌండర్, ముఖ్యంగా ఓపెనింగ్ బౌలర్ లాంటి లోపాలను అధిగమించాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి