IPL 2023: 2 మ్యాచుల్లో 16 రన్స్‌.. సన్‌ ‘రైజ్‌’ కాని రూ.13.25 కోట్ల ప్లేయర్‌.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

|

Apr 08, 2023 | 10:50 AM

ఐపీఎల్‌ మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీ బ్రూక్‌ను ఏకంగా రూ.13.25 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అయితే ఆ ధరకు బ్రూక్‌ ఏ మాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్ లో కేవలం 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

IPL 2023: 2 మ్యాచుల్లో 16 రన్స్‌.. సన్‌ రైజ్‌ కాని రూ.13.25 కోట్ల ప్లేయర్‌.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
Harry Brook
Follow us on

ఐపీఎల్‌ తాజా సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మరోసారి ఓడిపోయింది. కెప్టెన్‌ మర్‌క్రమ్‌ జట్టులోకి వచ్చినా టీం తలరాత మాత్రం మారలేదు. శుక్రవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లక్నో స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. క్రీజులో నిలవడానికే ఆపసోపాలు పడ్డారు. మయాంక్‌ అగర్వాల్‌ (8), మర్‌క్రమ్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. వీరి సంగతి పక్కన పెడితే టోర్నీ ప్రారంభానికి ముందు ఎన్నో అంచనాలు పెట్టుకున్న హ్యారీ బ్రూక్‌ మరోసారి నిరాశపర్చాడు. కేవలం 3 పరుగులకే పెవిలియన్‌ బాట పట్టాడు. ఐపీఎల్‌ మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీ బ్రూక్‌ను ఏకంగా రూ.13.25 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అయితే ఆ ధరకు బ్రూక్‌ ఏ మాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్ లో కేవలం 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తాజాగా లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ కేవలం 4 బంతులు ఆడి కేవలం 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇలా రెండు మ్యాచ్‌లు కలుపుకుని అరగంట కూడా క్రీజులో నిలవలేకపోయాడు.

వాస్తవానికి 1 కోటి 50 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేయడానికి హైదరాబాద్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,రాజస్థాన్ రాయల్స్ కూడా పోటీ పడ్డాయి. అయితే అంతర్జాతీయ మ్యాచుల్లో బ్రూక్‌ దూకుడును చూసి ఏకంగా రూ. 13. 25 కోట్లకు కొనుగోలు చేసింది హైదరాబాద్‌. ఐపీఎల్‌ కు ముందు బ్రూక్ న్యూజిలాండ్‌తో జరిగిన 2 టెస్ట్ సిరీస్‌లో ఒక సెంచరీ, 3 అర్ధసెంచరీలు చేశాడు. అలాగే, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌లపై కూడా అద్భుతంగా రాణించాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం అతని బ్యాట్‌ నుంచి పరుగులు రావడం లేదు. దీంతో టెస్టులు ఆడివారిని తీసుకొస్తే ఇలాగే ఉంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. రాబోయే మ్యాచుల్లోనైనా బ్రూక్‌ రాణించాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..