Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ఒక్క వికెట్‌కే కావ్యపాప వైల్డ్‌ సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్.. కానీ చివరకు..

122 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలి వికెట్‌ను తొందరగానే కోల్పోయింది. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఫరుకీ బౌలింగ్‌లో లక్నో డేంజరస్‌ బ్యాటర్‌ కైల్‌ మేయర్స్‌ మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. అయితే కైల్‌ మేయర్స్‌ వికెట్‌ పడాగానే..

IPL 2023: ఒక్క వికెట్‌కే కావ్యపాప వైల్డ్‌ సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్.. కానీ చివరకు..
Kaviya Maran
Follow us
Basha Shek

|

Updated on: Apr 08, 2023 | 12:49 PM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మరోసారి నిరాశపరిచింది. శుక్రవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ టోర్నీలో సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్‌ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతోంది ఆ ఫ్రాంచైజీ కో-ఓనర్‌ కావ్యా మారన్‌. మ్యాచ్‌ ఎక్కడ జరిగినా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లకు సపోర్టుగా నిలుస్తూ వస్తోంది. స్టేడియంలో సెలబ్రేషన్స్‌ చేసుకుంటూ తెగ సందడి చేస్తోంది. అందుకే హైదరాబాద్‌ మ్యాచ్‌ అంటే అందరి దృష్టి కావ్య పాపపైనే ఉంటాయి. కాగా తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ హల్‌ చల్‌ చేసింది కావ్య. తన సెలబ్రేషన్స్‌తో సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. 122 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలి వికెట్‌ను తొందరగానే కోల్పోయింది. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఫరుకీ బౌలింగ్‌లో లక్నో డేంజరస్‌ బ్యాటర్‌ కైల్‌ మేయర్స్‌ మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. అయితే కైల్‌ మేయర్స్‌ వికెట్‌ పడాగానే కావ్య మారన్‌ రెచ్చిపోయింది. సంతోషంలో కుర్చీలో నుంచి పైకి లేచి గట్టిగట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్‌ చేసుకుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. టార్గెట్‌ మరీ చిన్నది కావడంతో లక్నోసులభంగా గెలుపొందింది. దీంతో ఈ సీజన్‌లో వరుసగా రెండో ఓటమి నమోదు చేసింది ఎస్‌ఆర్‌హెచ్‌. కేవలం ఒక్క వికెట్‌కే వైల్డ్‌గా సెలబ్రేషన్స్‌ చేసుకుందంటే.. ఒక వేళ మ్యాచ్‌ గెలిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..