IND Vs SL: ‘ఒక్క మ్యాచ్ ఓడితే.. నేనూ బ్యాడ్ కెప్టెనే’.. రోహిత్ మరీ ఇంత మాట అనేశాడేంటి.!

ఒక్క మ్యాచ్ ఓడితే.. నేనూ బ్యాడ్ కెప్టెన్ అయిపోతానని అన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగే మ్యాచ్ నేపధ్యంలో ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హిట్‌మ్యాన్. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు వరుస విజయాలు సాధిస్తుండటంతో అందరూ తనను పొగిడేస్తున్నారని, అలాంటి పొగడ్తలకు తనకు అవసరం లేదని కెప్టెన్ చెప్పాడు.

IND Vs SL: ఒక్క మ్యాచ్ ఓడితే.. నేనూ బ్యాడ్ కెప్టెనే.. రోహిత్ మరీ ఇంత మాట అనేశాడేంటి.!
Cwc 2023 Rohit Sharma

Updated on: Nov 02, 2023 | 1:02 PM

ఒక్క మ్యాచ్ ఓడితే.. నేనూ బ్యాడ్ కెప్టెన్ అయిపోతానని అన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగే మ్యాచ్ నేపధ్యంలో ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హిట్‌మ్యాన్. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు వరుస విజయాలు సాధిస్తుండటంతో అందరూ తనను పొగిడేస్తున్నారని, అలాంటి పొగడ్తలకు తనకు అవసరం లేదని కెప్టెన్ చెప్పాడు. అలాగే తనపై బ్యాడ్ కెప్టెన్ అని ముద్ర వేయడానికి ఒక్క మ్యాచ్ చాలని కెప్టెన్ అభిప్రాయపడ్డారు. తాను జట్టును మంచి స్థితిలో ఉంచాలనుకుంటున్నానని.. తనను కలిసిన అభిమానులందరూ సెంచరీ చేయాలని.. ప్రపంచకప్ గెలవాలని కోరుతున్నారని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న తాను.. ఎప్పుడూ రిస్క్ షాట్లు ఆడుతున్న విషయం తనకు తెలుసని తెలిపాడు. ఆ స్థానంలో తాను ఎలా ఆడాలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటుందన్నాడు. తాను ఇలాగే ఆడతానని.. ఆ క్రమంలో కొన్నిసార్లు ఔటైనా ఫర్వాలేదని చెప్పాడు రోహిత్.

లంకతో మ్యాచ్ రోహిత్‌కి వెరీ స్పెషల్..

లంకతో జరగబోయే మ్యాచ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వెరీ వెరీ స్పెషల్. ఈ హిట్‌మ్యాన్ వాంఖడే స్టేడియంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు 12 ఏళ్ల క్రితం 2011లో ఈ వాంఖడే స్టేడియంలోనే భారత్, శ్రీలంక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మకు జట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు అదే శ్రీలంకపై కెప్టెన్‌గా భారత్ జట్టును సెమీస్ చేర్చేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.

జట్ల వివరాలు..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.

శ్రీలంక: కుసాల్ మెండిస్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, చరిత్ అసలంక, పాతుమ్ నిస్సంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, కుసల్ పెరీరా, సదీర సమరవిక్రమ, మహేశ్ తీక్షన, మహేశ్ తీక్షన, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర.

మరిన్ని వరల్డ్‌కప్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..