Danushka Gunathilaka: హోటల్‌ గదిలో మహిళపై అత్యాచారం.. శ్రీలంక క్రికెటర్‌ను అరెస్ట్‌ చేసిన సిడ్నీ పోలీసులు.

|

Nov 06, 2022 | 9:05 AM

శ్రీలంక క్రికెటర్‌ ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ధనుష్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ధనుష్కను అరెస్ట్ చేయడంతో ఆయన లేకుండానే శ్రీలంక టీం ఆస్ట్రేలియా..

Danushka Gunathilaka: హోటల్‌ గదిలో మహిళపై అత్యాచారం.. శ్రీలంక క్రికెటర్‌ను అరెస్ట్‌ చేసిన సిడ్నీ పోలీసులు.
Danushka Gunathilaka
Follow us on

శ్రీలంక క్రికెటర్‌ ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ధనుష్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ధనుష్కను అరెస్ట్ చేయడంతో ఆయన లేకుండానే శ్రీలంక టీం ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి పయనమైంది. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ధనుష్క ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లాడు.

అయితే వరల్డ్‌ కప్‌ మధ్యలోనే గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే సిడ్నిలోని ఓ హోటల్లో ఉంటున్నాడు. ఆ సమయంలోనే అక్కడే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఓ యువతి ధనుష్కపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సిడ్ని పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ తరుణంలోనే శ్రీలంక జట్టు… ధనుష్క గుణ తిలకను అక్కడే వదిలేసి స్వదేశానికి పయనమయింది. ఆదివారం ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓటమితో శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ధనుష్క గుణతిలక అరెస్ట్ వ్యవహారంపై న్యూ సౌత్ వేల్స్‌ పోలీసులు స్పందించారు. తమ అధికారిక వెబ్‌సైట్‌లో క్రికెటర్‌ అరెస్ట్‌ విషయాన్ని స్పందించింది. రోస్‌ బే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువతిపై నవంబర్‌ 2న క్రికెటర్‌ అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ధనుష్కను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..