SL vs AUS: శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం జరిగిన తొలి వన్డేలో 35 ఏళ్ల డేవిడ్ వార్నర్.. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌కు భారీ షాక్ ఇచ్చాడు. ఒంటిచేత్తో అద్భుత క్యాచ్ పట్టి, ఔరా అనిపించాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. వార్నర్ పట్టిన ఈ అద్బుత క్యాచ్ చూసిన బౌలర్ ఆష్టన్ అగర్ కూడా ఆశ్చర్యపోయి తల పట్టుకున్నాడు. అలాగే ఈ క్యాచ్ చూసి బ్యాటింగ్ చేస్తున్న ధనంజయ్ డిసిల్వా కూడా షాక్‌లో కొద్దిసేపు క్రీజులో అలానే ఉండిపోయాడు. ధనంజయ్ మిడ్-ఆన్ మీదుగా భారీ షాట్ ఆడాలనుకున్నాడు. ఈ క్రమంలో బంతిని బౌండరీ వెలుపల పంపేందుకు ట్రై చేశాడు. కానీ, సరిగ్గా టైం చేయలేకపోవడంతో, మిడ్-ఆన్ వద్ద నిలబడి ఉన్న డేవిడ్ వార్నర్.. దాదాపు అసాధ్యమైన క్యాచ్‌ను పట్టుకుని, ఔరా అనిపించాడు. ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మ్యాచ్‌లో వార్నర్ అద్భుతమైన క్యాచ్ పట్టి, ఫీల్డింగ్‌లో రాణించాడు. కానీ, అతని బ్యాట్ మాత్రం ఈ మ్యాచ్‌లో సత్తా చాటలేదు. వార్నర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. అతడిని మహేష్ దీక్షా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆస్ట్రేలియా ముందు 300 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
వర్షం ప్రభావితం చేసిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు డక్‌వర్త్-లూయిస్ నియమం ప్రకారం 44 ఓవర్లలో 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిని ఆస్ట్రేలియా 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుని ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 49వ ఓవర్‌లో ఝీ రిచర్డ్‌సన్ వేసిన మొదటి 5 బంతుల్లో వనిందు హసరంగ 5 ఫోర్లు కొట్టి మొత్తం 22 పరుగులు పిండుకున్నాడు. ఆఖరి ఓవర్‌లోనూ హేజిల్‌వుడ్ బౌండరీ బాదేశాడు. అనంతరం ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. హసరంగా 19 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేశాడు.
Brilliant catch by David Warner ♥️#SLvAUS pic.twitter.com/PBC3xV5P6D
— Umair Khan (@UmairKhWorld) June 14, 2022