Asia Cup 2024: భారత్- పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. స్టేడియంలోకి ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
మహిళల టీ20 ఆసియాకప్ ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. జూలై 19 నుంచి శ్రీలంకలోని దంబుల్లాలో టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో భారత్ మహిళల జట్టు పాకిస్థాన్, నేపాల్, యూఏఈలతో పాటు గ్రూప్-ఏలో ఉంది.

మహిళల టీ20 ఆసియాకప్ ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. జూలై 19 నుంచి శ్రీలంకలోని దంబుల్లాలో టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో భారత్ మహిళల జట్టు పాకిస్థాన్, నేపాల్, యూఏఈలతో పాటు గ్రూప్-ఏలో ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్ జట్లు గ్రూప్-బిలో చోటు దక్కించుకున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది, దీని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ టోర్నీపై శ్రీలంక క్రికెట్ బోర్డు పెద్ద ప్రకటన చేసింది. ఈ టోర్నీకి సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని మ్యాచ్‌లు అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అలాగే స్టేడియంలోకి అభిమానులకు ఉచిత ప్రవేశాన్నికల్పిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అంటే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను అభిమానులు మైదానానికి వెళ్లి ఉచితంగా వీక్షించవచ్చు. కాగా ఈ టోర్నీలో సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌తో కలిపి మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి.
జులై 19న పాకిస్థాన్‌తో టీం ఇండియా తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. దీని తర్వాత, భారత జట్టు జూలై 21 న UAE జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగుతుంది. ఆ తర్వాత జూలై 23న నేపాల్‌తో చివరి గ్రూప్ గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
ఆసియా కప్‌కు టీమిండియా జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్జ్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, దయాళన్ హేమలత, ఆశా శోభనాత , రాధా యాదవ్, శ్రేయాంకా పాటిల్, సంజన సంజీవన్.
రిజర్వ్‌లు:
శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్.
గతేడాది ఛాంపియన్‌గా భారత్..
🚨 NEWS 🚨#TeamIndia (Senior Women) squad for Women’s Asia Cup T20, 2024 announced.
Details 🔽 #WomensAsiaCup2024 | #ACC https://t.co/Jx5QcVVFLd pic.twitter.com/QVf7wOuTvs
— BCCI Women (@BCCIWomen) July 6, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




