Test Cricket: 100 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. ఇదేం ఇజ్జత్ పోయే స్కోర్ భయ్యా

SA vs SL: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న శ్రీలంక తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 42 పరుగులకే ఆలౌటైంది. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఆఫ్రికా పేసర్ మార్కో జాన్సన్ 7 వికెట్లు పడగొట్టి లంక జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేశాడు.

Test Cricket: 100 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. ఇదేం ఇజ్జత్ పోయే స్కోర్ భయ్యా
Sa Vs Sl
Follow us
Venkata Chari

|

Updated on: Nov 29, 2024 | 11:16 AM

శ్రీలంక జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ కింగ్స్‌మీడ్ డర్బన్‌లో జరుగుతోంది. వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు కేవలం 20.4 ఓవర్లు మాత్రమే ఆడాయి. కానీ, రెండో రోజు ఆట కొనసాగింది. దక్షిణాఫ్రికా 191 పరుగులకు తన మొదటి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు ఆఫ్రికన్ బౌలర్ల ధాటికి 42 పరుగులకే ఆలౌటైంది.

కోలుకోని లంక..

ఆఫ్రికన్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 13.5 ఓవర్లలో 42 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్రికా తరుపున మార్కో జాన్సన్ ఏకంగా ఏడుగురు లంక బ్యాట్స్‌మెన్‌లను బౌల్డ్ చేశాడు. మార్కో జాన్సన్ కేవలం 6.5 ఓవర్లు వేసి 13 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సన్‌తో పాటు గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు తీయగా, కగిసో రబడా 1 వికెట్ తీసుకున్నాడు.

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 13.5 ఓవర్లు లేదా 83 బంతుల్లోనే ఆలౌటైంది. టెస్ట్ క్రికెట్‌లో రెండో అతి తక్కువ బౌలర్‌గా నిలిచింది. అంతకుముందు 1924లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 75 బంతుల్లో 30 పరుగులకే ఆలౌటైంది. అంటే, టెస్టు క్రికెట్‌లో 100 ఏళ్ల తర్వాత ఈ ఘటన పునరావృతమైంది.

ఇవి కూడా చదవండి

లంక జట్టు అద్భుత ప్రదర్శన..

అతి తక్కువ బంతుల్లో ఔటవ్వడంతో పాటు, టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయిన రికార్డును కూడా లంక జట్టు సొంతం చేసుకుంది. దీనికి ముందు 1994లో పాకిస్థాన్‌పై శ్రీలంక 71 పరుగులకే ఆలౌటైంది. కాగా, ఒక టెస్టులో లంక జట్టు 50 పరుగుల మార్కును అందుకోకుండానే ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. మరోవైపు ప్రత్యర్థి జట్టును ఇంత తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఘనత సౌతాఫ్రికా తొలిసారి. అంతకుముందు 2013లో దక్షిణాఫ్రికా 45 పరుగులకే న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేసింది. ఇది ఇప్పటివరకు రికార్డుగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..