AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: తొలి క్వాలిఫైయర్‌లో SRH ఎంట్రీ అవ్వాలంటే.. RCBపై ఎంత తేడాతో గెలవాలంటే?

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru: నేడు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌‌లో హైదరాబాద్ జట్టు భారీ తేడాతో గెలవాల్సి ఉంది. అప్పుడే క్వాలిఫైయర్ 1లోకి అడుగుపెట్టనుంది.

IPL 2026: తొలి క్వాలిఫైయర్‌లో SRH ఎంట్రీ అవ్వాలంటే.. RCBపై ఎంత తేడాతో గెలవాలంటే?
Srh Vs Rcb Match
Venkata Chari
|

Updated on: May 22, 2026 | 1:10 PM

Share

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించి తన సత్తా చాటింది. అయితే, లీగ్ దశ ముగిసే సమయానికి కేవలం ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా, పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలవడం ప్రతి జట్టుకూ ఎంతో ముఖ్యం. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ మూడో స్థానంలో ఉంది. ఈ రోజు ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరగబోయే మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు అత్యంత కీలకంగా మారింది. ఈ పోరులో భారీ విజయం సాధిస్తేనే సన్‌రైజర్స్ టాప్-2 లోకి దూసుకెళ్లే అవకాశం ఉంటుంది.

పాయింట్ల పట్టికలో ప్రస్తుత సమీకరణాలు..

ప్రస్తుతం పాయింట్ల పట్టికను గమనిస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పాయింట్లు, +1.1065 నెట్ రన్ రేట్ తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక నిన్న సిఎస్కే పై 89 పరుగుల భారీ విజయాన్ని అందుకోవడం ద్వారా గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లు, +0.695 రన్ రేట్ తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ జట్టు 16 పాయింట్లు, +0.350 రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది. ఈ రోజు మ్యాచ్ లో కేవలం విజయం సాధిస్తే ఎస్‌ఆర్‌హెచ్ మూడో స్థానానికే పరిమితమవుతుంది. కానీ క్వాలిఫయర్-1 కు వెళ్లాలంటే మాత్రం నెట్ రన్ రేట్ ను భారీగా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.

టాప్-2 కి చేరాలంటే ఎస్‌ఆర్‌హెచ్ ముందున్న లక్ష్యాలు..

గుజరాత్ టైటాన్స్ కంటే మెరుగైన రన్ రేట్ సాధించి రెండో స్థానానికి చేరాలంటే, సన్‌రైజర్స్ ఈ రోజు మ్యాచ్ లో అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. ఆ సమీకరణాలు ఇలా ఉన్నాయి:

మొదట బ్యాటింగ్ చేస్తే: సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ కు దిగితే కనీసం 200 నుంmr 220 పరుగుల భారీ స్కోరు బోర్డుపై ఉంచాలి. ఆ తర్వాత ఆర్సీబీని తక్కువ పరుగులకే కట్టడి చేస్తూ, దాదాపు 87 లేదా 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.

ఛేజింగ్ చేస్తే: ఒకవేళ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే, వారిని కేవలం 150 పరుగుల లోపే కట్టడి చేయాలి. అనంతరం ఆ లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు కేవలం 11.1 నుంmr 11.3 ఓవర్లలోనే ఊదేయాల్సి ఉంటుంది.

మొదటి క్వాలిఫయర్ వల్ల కలిగే ప్రయోజనం..

ప్లే ఆఫ్స్ లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు ఒక ప్రత్యేకమైన సదుపాయం ఉంటుంది. క్వాలిఫయర్-1 లో తలపడే రెండు జట్లలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్ లో ఓడిపోయినా, ఫైనల్ కు వెళ్లేందుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో సువర్ణావకాశం లభిస్తుంది. అందుకే ప్రతి జట్టు మొదటి రెండు స్థానాల కోసం తీవ్రంగా శ్రమిస్తుంది.

ప్రస్తుతం ఆర్సీబీ జట్టు అద్భుతమైన ఫామ్ లో ఉంది. అలాంటి బలమైన జట్టుపై ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేయడం సన్‌రైజర్స్ కు అంత సులువైన విషయం కాదు. మైదానంలో ఖచ్చితమైన వ్యూహాలతో బరిలోకి దిగి, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ అసాధారణ ప్రదర్శన చేస్తేనే హైదరాబాద్ జట్టు అనుకున్న లక్ష్యాన్ని సాధించి టాప్-2 లో జెండా పాతగలదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us