SRH vs LSG Highlights, IPL 2024: హెడ్, అభిషేక్ శర్మల ఊచకోత.. లక్నోపై ఘన విజయం..

Sunrisers Hyderabad vs Lucknow Super Giants, ఐపీఎల్‌ Highlights: IPL-2024 57వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలో సాధించింది. ఐపీఎల్‌లో 150+ స్కోర్‌ల వేగవంతమైన పరుగుల వేట ఇదే. ఈ విజయంతో హైదరాబాద్ (14 పాయింట్లు) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా, లక్నో ఆరో స్థానానికి దిగజారింది.

SRH vs LSG Highlights, IPL 2024: హెడ్, అభిషేక్ శర్మల ఊచకోత.. లక్నోపై ఘన విజయం..
Srh Vs Lsg

Updated on: May 08, 2024 | 10:29 PM

Sunrisers Hyderabad vs Lucknow Super Giants, ఐపీఎల్‌ Highlights: IPL-2024 57వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలో సాధించింది. ఐపీఎల్‌లో 150+ స్కోర్‌ల వేగవంతమైన పరుగుల వేట ఇదే. ఈ విజయంతో హైదరాబాద్ (14 పాయింట్లు) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా, లక్నో ఆరో స్థానానికి దిగజారింది.

ఐపీఎల్-2024 57వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 166 పరుగుల లక్ష్యాన్ని అందించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది.

ఎల్‌ఎస్‌జీలో ఆయుష్ బదోని 55 పరుగులు, నికోలస్ పురాన్ 48 పరుగులు చేశారు. వీరిద్దరి మధ్య 99 పరుగుల భాగస్వామ్యం ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 29 పరుగులు చేశాడు. భువనేశ్వర్ కుమార్ కేవలం 12 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు లక్నో సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్ తిరిగి ప్లేయింగ్-11కి చేరుకోగా, మోహ్సిన్ ఖాన్ గాయం కారణంగా ఆడడం లేదు. మరోవైపు హైదరాబాద్‌లో రెండు మార్పులు చేసింది. సన్వీర్ సింగ్, విజయకాంత్‌లకు అవకాశం దక్కింది. విజయకాంత్ అరంగేట్రం చేస్తున్నారు.

ఈరోజు SRH, LSG రెండింటికీ సీజన్‌లో 12వ మ్యాచ్. ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా 6 గెలిచి 5 ఓడిపోయాయి. మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో, లక్నో ఐదో స్థానంలో నిలిచాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుకు క్వాలిఫైయింగ్ అవకాశాలు మెరుగవుతాయి.

ఇరు జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్, కీపర్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ శర్మ, ,మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్.

లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మణిమారన్ సిద్ధార్థ్, యుధ్వీర్ సింగ్, దేవదత్ పడిక్కల్, అష్టన్ టర్నర్, అమిత్ మిశ్రా.

పిచ్ నివేదిక..

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. బౌలర్లు కూడా ఇక్కడ సహాయం పొందుతారు. అధిక స్కోరింగ్ మ్యాచ్‌లు ఇక్కడ కనిపిస్తాయి. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 75 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా అందులో 34 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందగా, 41 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ జట్లు గెలిచాయి.

వాతావరణ పరిస్థితులు..

మే 8న హైదరాబాద్‌లో 40% వర్షం పడే అవకాశం ఉంది. అయితే, పగటిపూట తేలికపాటి సూర్యరశ్మి ఉంది. ఉష్ణోగ్రత 26 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

Key Events

ఇరుజట్లకు 12వ మ్యాచ్

ఈరోజు SRH, LSG జట్లకు సీజన్‌లో 12వ మ్యాచ్. ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా 6 గెలిచి 5 ఓడిపోయాయి.

4వ స్థానంలో హైదరాబాద్

మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో, లక్నో ఐదో స్థానంలో నిలిచాయి.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 08 May 2024 10:21 PM (IST)

    హైదరాబాద్ ఘన విజయం..

    IPL-2024 57వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలో సాధించింది. ఐపీఎల్‌లో 150+ స్కోర్‌ల వేగవంతమైన పరుగుల వేట ఇదే. ఈ విజయంతో హైదరాబాద్ (14 పాయింట్లు) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా, లక్నో ఆరో స్థానానికి దిగజారింది.

  • 08 May 2024 10:04 PM (IST)

    రెండోసారి 100కుపైగా పరుగులు..

    ఈ సీజన్‌లో హైదరాబాద్‌ రెండోసారి పవర్‌ప్లేలో 100కు పైగా పరుగులు చేసింది. లక్నోపై ఆ జట్టు 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేసింది.


  • 08 May 2024 09:59 PM (IST)

    6 ఓవర్లలోనే 100 దాటిన స్కోర్..

    హైదరాబాద్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం ఉంది. ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేశాడు.

  • 08 May 2024 09:59 PM (IST)

    16 బంతుల్లో హెడ్ ఊచకోత

    హెడ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 5 ఫోర్లు, 5 సిక్సులతో బౌండరీల వర్షం కురిపించాడు.

  • 08 May 2024 09:48 PM (IST)

    19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

    హైదరాబాద్ జట్టు కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసింది. ఓపెనర్లు వీర విహారం చేస్తూ బౌండరీల వర్షం కురిపిస్తున్నారు.

  • 08 May 2024 09:45 PM (IST)

    యశ్ ఠాకూర్ ఓవర్లో అభిషేక్ వరుసగా 4 ఫోర్లు

    యశ్ ఠాకూర్ వేసిన ఓవర్లో హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. అతను మూడవ, నాల్గవ, ఐదవ, ఆరో బంతులను బౌండరీ లైన్ వెలుపలకు పంపించాడు. మరోవైపు హెడ్ కూడా బౌండరీల వర్షం కురిపించడంతో హైదరాబాద్ 3 ఓవర్లకు 47 పరుగులు చేసింది.

  • 08 May 2024 09:18 PM (IST)

    హైదరాబాద్ టార్గెట్ 166

    ఐపీఎల్-2024 57వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 166 పరుగుల లక్ష్యాన్ని అందించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది.

  • 08 May 2024 09:10 PM (IST)

    బదోని హాఫ్ సెంచరీ..

    17వ ఓవర్‌లో నికోలస్‌ పురాన్‌, ఆయుష్‌ బదోని యాభై భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. నటరాజన్ వేసిన ఓవర్ రెండో బంతికి పూరన్ రెండు పరుగులు తీసి యాభై భాగస్వామ్యాన్ని పూర్తి చేశాడు. 19 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు 146 పరుగులు చేసింది. ఈ క్రమంలో బదోని 28 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

  • 08 May 2024 08:59 PM (IST)

    100 పరుగులు దాటిన లక్నో..

    లక్నో 15వ ఓవర్లో 100 పరుగుల మార్కును అధిగమించింది. విజయకాంత్ వేసిన ఓవర్ చివరి బంతికి ఆయుష్ బదోని ఫోర్ కొట్టి జట్టు స్కోరు 100 దాటేలా చేశాడు.

  • 08 May 2024 08:45 PM (IST)

    నటరాజ్ ఓవర్లో బదోని మూడు ఫోర్లు..

    14వ ఓవర్ వేయడానికి వచ్చిన టి. నటరాజన్ ఓవర్‌లో ఆయుష్ బదోని మూడు ఫోర్లు బాదాడు. ఆ ఓవర్ రెండో, మూడో, ఐదో బంతుల్లో బౌండరీలు బాదాడు. ఈ ఓవర్ తర్వాత లక్నో స్కోరు 90/4.

  • 08 May 2024 08:32 PM (IST)

    కృనాల్ పాండ్యా రనౌట్

    12వ ఓవర్ రెండో బంతికి రనౌట్ అయిన కృనాల్ పాండ్యా రూపంలో లక్నోకు నాలుగో దెబ్బ తగిలింది. పాండ్యా 21 బంతుల్లో 24 పరుగులు చేశాడు.

  • 08 May 2024 08:18 PM (IST)

    ఐపీఎల్ 2024 సీజన్‌లో 1000 సిక్సర్లు..

    ప్రస్తుత సీజన్‌లో 1000 సిక్సర్లు 8వ ఓవర్‌లో పూర్తయ్యాయి. ఉనద్కత్ వేసిన ఓవర్లో కృనాల్ పాండ్యా వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్‌లో నాలుగో, ఐదో బంతుల్ని బౌండరీలకు తరలించాడు. ఈ ఓవర్‌లో 15 పరుగులు రావడంతో లక్నో స్కోరు 8 ఓవర్లలో 45/2గా మారింది.

  • 08 May 2024 08:12 PM (IST)

    కష్టాల్లో లక్నో..

    లక్నో జట్టు 7 ఓవర్లలో 2 వికెట్లకు 30 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా ఉన్నారు.

  • 08 May 2024 07:59 PM (IST)

    5 ఓవర్లలో

    లక్నో జట్టు 5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా ఉన్నారు.

    మార్కస్ స్టోయినిస్ 3 పరుగుల వద్ద ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో సన్వీర్ సింగ్ అద్భుత క్యాచ్తో పెవిలియన్ చేరాడు. క్వింటన్ డి కాక్ (2 పరుగులు)ని కూడా భువీ పెవిలియన్ పంపాడు.

  • 08 May 2024 07:48 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్..

    3 ఓవర్లలో లక్నో ఒక వికెట్ కోల్పోయి 15 పరుగులు చేసింది. భువనేశ్వర్ వేసిన 2వ ఓవర్లో డికాక్ (2) పరుగులకే పెవిలియన్ చేరాడు. నితీష్ రెడ్డి అద్భుతమైన క్యాచ్ పట్టాడు.

  • 08 May 2024 07:15 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ శర్మ, ,మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్.

  • 08 May 2024 07:15 PM (IST)

    లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్

    లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మణిమారన్ సిద్ధార్థ్, యుధ్వీర్ సింగ్, దేవదత్ పడిక్కల్, అష్టన్ టర్నర్, అమిత్ మిశ్రా.

  • 08 May 2024 07:13 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:

    ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్.

  • 08 May 2024 07:12 PM (IST)

    లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI

    క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్, కీపర్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్.

  • 08 May 2024 07:02 PM (IST)

    టాస్ గెలిచిన లక్నో..

    హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన లక్నో టీం.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ బౌలింగ్ చేయనుంది.

  • 08 May 2024 07:00 PM (IST)

    లక్నోదే పైచేయి..

    హైదరాబాద్, లక్నో మధ్య లీగ్‌లో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు జరిగాయి. అన్నీ మ్యాచ్‌ల్లో లక్నో గెలిచింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఒక మ్యాచ్ జరిగింది. లక్నో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • 08 May 2024 06:58 PM (IST)

    వర్షం పడే ఛాన్స్..

    మే 8న హైదరాబాద్‌లో 40% వర్షం పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 26 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

  • 08 May 2024 06:57 PM (IST)

    పిచ్ ఎలా ఉందంటే

    రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. బౌలర్లు కూడా ఇక్కడ సహాయం పొందుతారు. అధిక స్కోరింగ్ మ్యాచ్‌లు ఇక్కడ కనిపిస్తాయి. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 75 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా అందులో 34 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందగా, 41 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ జట్లు గెలిచాయి.

  • 08 May 2024 06:56 PM (IST)

    ఇరుజట్లకు 12వ మ్యాచ్

    ఈరోజు SRH, LSG రెండింటికీ సీజన్‌లో 12వ మ్యాచ్. ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా 6 గెలిచి 5 ఓడిపోయాయి. మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో, లక్నో ఐదో స్థానంలో నిలిచాయి.

  • 08 May 2024 06:53 PM (IST)

    కీలక పోరుకు హైదరాబాద్, లక్నో

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు లక్నో సూపర్‌జెయింట్‌తో తలపడనుంది.