Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Live Score in Telugu: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సొంతగడ్డపై హైదరాబాద్ విజయానికి 172 పరుగులు చేయాల్సి ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు లీగ్ దశలో 47వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరుగుతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలైంది. ఈ సీజన్‌లో హైదరాబాద్, కోల్‌కతా జట్లు రెండోసారి తలపడనున్నాయి.
అంతకుముందు, ఈ సీజన్‌లోని 19వ మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడగా, హైదరాబాద్ 23 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
సన్‌రైజర్స్ హైదరాబాద్: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకిల్ హొస్సేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్
ఇంపాక్ట్ ప్లేయర్స్: కార్తీక్ త్యాగి, మార్కో జాన్సన్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ డాగర్, టి నటరాజన్.
కోల్‌కతా నైట్ రైడర్స్: నితీష్ రాణా (కెప్టెన్), జాసన్ రాయ్, రహమానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రింకూ సింగ్, వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ శర్మ, మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, టిమ్ సౌథీ, కుల్వంత్ ఖేజ్రోలియా.
హైదరాబాద్ జట్టు 4 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.
కోల్‌కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ ముందు 172 పరుగుల టార్గెట్ ఉంది. రింకూ సింగ్ 46, కెప్టెన్ నితీశ్ రాణా 42 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్ తలో 2 వికెట్లు తీశారు.
17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.
10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రాణా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. క్రీజులో రింకూ సింగ్, నితీష్ రాణా ఉన్నారు. 7 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్: నితీష్ రాణా (కెప్టెన్), జాసన్ రాయ్, రహమానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రింకూ సింగ్, వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ శర్మ, మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, టిమ్ సౌథీ, కుల్వంత్ ఖేజ్రోలియా.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకిల్ హొస్సేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్
ఇంపాక్ట్ ప్లేయర్స్: కార్తీక్ త్యాగి, మార్కో జాన్సన్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ డాగర్, టి నటరాజన్.
కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ సారథి నితీష్ రాణా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో హైదరాబాద్ టీం తొలుత బౌలింగ్ చేయనుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకసారి టైటిల్ గెలుచుకున్నాయి. ఇరు జట్లు 24 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా 15 సార్లు, హైదరాబాద్ 9 సార్లు గెలుపొందాయి.
కోల్‌కతా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 3 మ్యాచుల్లో గెలిచింది. ఇందులో మూడు గెలిచి ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది. KKR ఇప్పుడు 6 పాయింట్లను కలిగి ఉంది. కోల్‌కతా తన చివరి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిపోయింది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 3 విజయాలు, 5 ఓటములతో నిలిచింది. ఖాతాలో కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ చివరి మ్యాచ్‌లో ఢిల్లీని 9 పరుగుల తేడాతో ఓడించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.