IPL 2021 Update: మరో వారం రోజుల్లో భారత్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 మొదలు కానుంది. ఇప్పటికే టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్‌లన్నీ కూడా ముగియడంతో.. స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా ఆయా ఫ్రాంచైజీలతో చేరిపోయారు. జట్ల శిక్షణా శిబిరాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇంతవరకూ బాగానే ఉంది గానీ.. లీగ్ మొదట్లో పలు జట్లకు మాత్రం కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య సిరీస్ దీనికి కారణం. దీనితో క్వింటన్ డి కాక్ (MI), కగిసో రబాడా (DC), ఎన్రిక్ నార్ఖియా (DC), డేవిడ్ మిల్లెర్ (RR), లుంగి ఎంగిడి(CSK) మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఏప్రిల్ 2 నుంచి దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఏప్రిల్ 7వ తేదీన జరుగుతుంది. రెండో వన్డే అనంతరం ఐపీఎల్ కోసం దక్షిణాఫ్రికా బోర్డు ఆటగాళ్లకు అనుమతిచ్చింది. అయితే కరోనా నిబంధనలు కారణంగా లీగ్ ఆరంభ మ్యాచ్‌లలో ఆయా ఆటగాళ్లు ఆడటం కష్టం. దీనితో ఢిల్లీ, రాజస్థాన్, ముంబై జట్లు స్టార్ ప్లేయర్స్ లేకుండా మొదటి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సీఎస్కే, రాజస్థాన్ జట్లకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. ఢిల్లీ, ముంబై జట్లకు కీలక ఆటగాళ్లు దూరం అవుతారు.
Also Read:
చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!