INDW vs SAW: పేలవమైన ఫీల్డింగ్, బౌలింగ్‌.. కట్‌చేస్తే.. సిరీస్‌లో తొలిసారి ఓడిన భారత్..

Indian Women vs South Africa Women: చిదంబరం స్టేడియంలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి T20Iలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 12 పరుగుల తేడాతో భారత్ మహిళలను ఓడించి T20I సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. దీంతో భారత పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి విజయ ఖాతా తెరిచింది.

INDW vs SAW: పేలవమైన ఫీల్డింగ్, బౌలింగ్‌.. కట్‌చేస్తే.. సిరీస్‌లో తొలిసారి ఓడిన భారత్..
Ind W Vs Sa W St T20i
Follow us
Venkata Chari

|

Updated on: Jul 06, 2024 | 6:49 AM

INDW vs SAW: చిదంబరం స్టేడియంలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి T20Iలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 12 పరుగుల తేడాతో భారత్ మహిళలను ఓడించి T20I సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. దీంతో భారత పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి విజయ ఖాతా తెరిచింది. టీ20 సిరీస్‌కు ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఏకైక టెస్టు మ్యాచ్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. టీ20 సిరీస్‌లోనూ భారత్‌కు విజయాన్నందించే అవకాశం ఉంది. కానీ, పేలవమైన ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగా భారత జట్టు ఓటమి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

భారత్ పేలవ ఫీల్డింగ్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు లారా వోల్వార్డ్, తజ్మిన్ బ్రిట్స్ తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయానికి నాంది వేసింది. నిజానికి 3వ ఓవర్‌లో తజ్మిన్ బ్రిట్స్ సులువైన క్యాచ్ పట్టాడు. కెప్టెన్ లారా 33 పరుగులకే వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మరిజానే కప్ కూడా 57 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది.

తజ్మిన్ బ్రిట్స్ 81 పరుగులు..

ఇదిలా ఉంటే.. 16వ ఓవర్లో తజ్మిన్ బ్రిట్స్ రెండోసారి సులువుగా క్యాచ్ ఇచ్చినా వికెట్ కీపర్ రిచా ఘోష్ దానిని వదిలేసింది. ఇది జట్టుకు చాలా ఖరీదుగా మారింది. ఆఖర్లో రెచ్చిపోయిన తజ్మిన్ బ్రిట్స్.. 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది.

భారత్‌కు కూడా శుభారంభం..

ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు స్మృతి మంధాన, షఫాలీ వర్మ తుఫాన్ బ్యాటింగ్‌తో శుభారంభం అందించారు. అయితే షఫాలీ వికెట్ పతనంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. అయితే వీరిద్దరూ తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. మూడో స్థానంలో వచ్చిన హేమలత తన ఇన్నింగ్స్‌ను 14 పరుగులకే ముగించడమే కాకుండా డాట్ బాల్స్ ఆడుతూ స్మృతిపై ఒత్తిడి పెంచింది. ఈ విధంగా స్మృతి ఒత్తిడితో భారీ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో స్టంపౌట్ అయింది. ఆ సమయానికి స్మృతి 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసింది.

విజయం కోసం పోరాడి ఓడిన భారత్..

స్మృతి వికెట్‌ పతనం తర్వాత కో-కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, జమీమా విజయం కోసం చివరి వరకు పోరాడారు. కానీ, ఈ ఇద్దరూ ఆఫ్రికా ఆఫర్ చేసిన భారీ మొత్తాన్ని సాధించలేకపోయారు. అయితే వీరిద్దరూ పోరాట ఇన్నింగ్స్ ఆడి 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జమీమా 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 53 పరుగులు చేయగా, హర్మన్‌ప్రీత్ 29 బంతుల్లో 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప