AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs AUS: కల చెదిరింది.. దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ హైలెట్స్‌.. వీడియో

ఐసీసీ వరల్డ్ కప్ 2023లో టీమ్ ఇండియా సెమీఫైనల్‌కు చేరిన తర్వాత , ఫైనల్‌లో భారత్ ఎవరిని ఎదుర్కొంటుంది అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. గురువారం (నవంబర్‌ 17) కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసీస్‌ రికార్డు స్థాయిలో 8 సార్లు ప్రపంచ కప్‌ ఫైనల్‌ కు చేరుకోగా..

SA vs AUS: కల చెదిరింది.. దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ హైలెట్స్‌.. వీడియో
South Africa Vs Australia
Basha Shek
|

Updated on: Nov 17, 2023 | 7:22 AM

Share

ఐసీసీ వరల్డ్ కప్ 2023లో టీమ్ ఇండియా సెమీఫైనల్‌కు చేరిన తర్వాత , ఫైనల్‌లో భారత్ ఎవరిని ఎదుర్కొంటుంది అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. గురువారం (నవంబర్‌ 17) కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసీస్‌ రికార్డు స్థాయిలో 8 సార్లు ప్రపంచ కప్‌ ఫైనల్‌ కు చేరుకోగా, దక్షిణాఫ్రికా జట్టు నాకౌట్ మ్యాచ్‌లో మళ్లీ తడబడి చోకర్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు ఆసీస్ బౌలర్ల ధాటికి తడబడి 212 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టు తరఫున ఒంటరి పోరాటం చేసిన డేవిడ్ మిల్లర్ సెంచరీ సాధించాడు. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో 8వ సారి ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు 2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో తలపడనుంది. దీంతో 20 ఏళ్ల తర్వాత మళ్లీ టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 2003 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అప్పట్లో టీమ్ ఇండియాపై ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి 20 ఏళ్ల క్రితం నాటి ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం లభించింది.

దక్షిణా ఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ హైలెట్స్.. వీడియో

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా టాప్ ఫోర్  బ్యాటర్లు క్వింటన్ డి కాక్ (3), టెంబా బావుమా (0), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (6), ఐడెన్ మార్క్రమ్ (10) వచ్చిన వెంటనే పెవిలియన్ చేరారు. మిచెల్ స్టార్క్ (10-1-34-3), జోష్ హేజిల్‌వుడ్ (8-3-12-2) పరిస్థితిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆరంభంలోనే వికెట్లు తీశారు. అయితే దక్షిణాఫ్రికా స్కోరు 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 44 పరుగుల వద్ద ఉండగా మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. సుమారు 40 నిమిషాల మ్యాచ్ నిలిచిపోయింది. అయితే డేవిడ్ మిల్లర్ 116 బంతుల్లో ఎనిమిది ఫోర్లు,  ఐదు సిక్సర్లతో తన ఆరో వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఐదో వికెట్‌కు హెన్రిచ్ క్లాసెన్ (47 పరుగులు)తో కలిసి 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా మిల్లర్ దక్షిణాఫ్రికాకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు.

213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. వార్నర్, ట్రావిస్ హెడ్‌లు తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తర్వాత వార్నర్ 29 పరుగులు, 62 పరుగుల వద్ద హెడ్ అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా తరఫున హెడ్ అత్యధిక స్కోరు సాధించగా, కెప్టెన్ కమిన్స్  14 (నాటౌట్), స్టార్క్ అజేయంగా 16 పరుగులు చేసి ఆసీస్ ను గెలిపించారు.

ఆసీస్ విన్నింగ్ మూమెంట్

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయడి

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు