AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బుడ్డోడు మాములోడు కాదు భయ్యో.. తిరగేసి మరి బాదేస్తున్నాడు.. షేక్ అవుతున్న సోషల్ మీడియా

Viral Video: ఇంత చిన్న వయస్సులో హ్యూగో పట్టుదల చూస్తుంటే.. అతను దక్షిణాఫ్రికాకు తదుపరి డివిలియర్స్ అవుతాడని చాలా మంది విశ్వసిస్తున్నారు. అతను ఆ టైటిల్‌ను క్లెయిమ్ చేయడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. యువ దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ U19 ప్రపంచ కప్ 2022లో అతని వీరోచిత ప్రదర్శనల మేరకు.. తదుపరి AB డివిల్లర్స్ అని పేరుగాంచాడు. అక్కడ అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ లభించింది.

Video: బుడ్డోడు మాములోడు కాదు భయ్యో.. తిరగేసి మరి బాదేస్తున్నాడు.. షేక్ అవుతున్న సోషల్ మీడియా
South African Toddler Video
Venkata Chari
|

Updated on: Feb 13, 2024 | 9:50 PM

Share

South Africa Toddler’s Batting Skills Video: దక్షిణాఫ్రికాకు చెందిన ఓ చిన్నపిలోడు అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలో క్రికెట్ విషయానికి వస్తే ప్రతిభకు కొరత లేదు. ఎందుకంటే ఈ దేశం గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యంత మెస్ట్ టాలెండెట్ ఆటగాళ్లను తయారు చేసింది. అయితే, దేశానికి చెందిన 3 ఏళ్ల బుడతడు.. ఫుల్ స్వింగ్‌లో బ్యాటింగ్ చేస్తూ సరదాగా షాట్‌లు కొట్టిన వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

వీడియోలో, ఈ పిల్లోడు టోపీతో బ్యాటింగ్ చేస్తూ, మైదానంలోని అన్ని భాగాలలో షాట్లు ఆడుతూ కనిపించాడు. అతను హాఫ్ సెంచరీకి ముందు ఓ పరుగు పూర్తి చేయడానికి డైవ్‌ కూడా చేసేశాడు. ఈ చిన్నోడి బ్యాటింగ్ టెక్నిక్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది అతన్ని దక్షిణాఫ్రికాకు తదుపరి AB డివిలియర్స్‌గా ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

వీడియోలోని పిల్లవాడు పేరు హ్యూగో మావెరిక్ హీత్. అతని ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అనేక వీడియోలు ఉన్నాయి. అక్కడ అతను క్రికెట్ ఆడుతున్నట్లు చూడొచ్చు. ఆటపై అతని ప్రేమ ఏంటో వీడియోల్లో చూడొచ్చు. హ్యూగో ఇన్‌స్టాగ్రామ్ పేజీలోని ఒక పోస్ట్‌లో, అతను ఇటీవల ముగిసిన SA20లో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు మద్దతు ఇస్తున్నట్లు కూడా చూడొచ్చు.

ఆస్ట్రేలియన్ కాదు..!

చాలా మంది అభిమానులు 3 ఏళ్ల హ్యూగోను ఆస్ట్రేలియన్ పిల్లవాడిగా అనేక సోషల్ మీడియా పేజీల్లో పేర్కొంటున్నారు. ఈ మేరకు అతన్ని ‘ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యూచర్’ అంటూ పిలుస్తున్నారు. అయితే, హ్యూగో దక్షిణాఫ్రికాకు చెందినవాడు. అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించాడు.

దక్షిణాఫ్రికా తదుపరి ఏబీ డివిలియర్స్?

ఇంత చిన్న వయస్సులో హ్యూగో పట్టుదల చూస్తుంటే.. అతను దక్షిణాఫ్రికాకు తదుపరి డివిలియర్స్ అవుతాడని చాలా మంది విశ్వసిస్తున్నారు. అతను ఆ టైటిల్‌ను క్లెయిమ్ చేయడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. యువ దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ U19 ప్రపంచ కప్ 2022లో అతని వీరోచిత ప్రదర్శనల మేరకు.. తదుపరి AB డివిల్లర్స్ అని పేరుగాంచాడు. అక్కడ అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ లభించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బ్రీవిస్ ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI)టీంలో ఎంపికయ్యాడు. అతను ఇప్పటికే దక్షిణాఫ్రికా తరపున తన T20I అరంగేట్రం చేశాడు. కానీ, ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 5 పరుగులు చేశాడు. బ్రీవిస్ ప్రోటీస్ తరపున తన ODI, టెస్ట్ అరంగేట్రం చేయలేదు.

మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
ఈ ఫెంగ్ షుయ్ వస్తువులు ఇంట్లో ఉంటే.. అదృష్టం మీవెంటే!
ఈ ఫెంగ్ షుయ్ వస్తువులు ఇంట్లో ఉంటే.. అదృష్టం మీవెంటే!