AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: మ్యాచ్‌కు ముందే రిటైర్మెంట్.. కట్‌చేస్తే.. సెంచరీతో కదం తొక్కిన ఎల్గర్.. భారత్‌పై భారీ ఆధిక్యం దిశగా సౌతాఫ్రికా

South Africa vs India 1st Test: రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 11 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఆ జట్టు 5 వికెట్లకు 256 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరపున డీన్ ఎల్గర్ సెంచరీ సాధించాడు. అతను 140 పరుగులు చేసిన తర్వాత మార్కో జాన్సన్ (3 పరుగులు)తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలో 2 వికెట్లు తీశారు.

IND vs SA: మ్యాచ్‌కు ముందే రిటైర్మెంట్.. కట్‌చేస్తే.. సెంచరీతో కదం తొక్కిన ఎల్గర్.. భారత్‌పై భారీ ఆధిక్యం దిశగా సౌతాఫ్రికా
Sa Vs Ind 1st Test
Venkata Chari
|

Updated on: Dec 27, 2023 | 9:29 PM

Share

South Africa vs India 1st Test: సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరుగుతోంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 11 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఆ జట్టు 5 వికెట్లకు 256 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరపున డీన్ ఎల్గర్ సెంచరీ సాధించాడు. అతను 140 పరుగులు చేసిన తర్వాత మార్కో జాన్సన్ (3 పరుగులు)తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలో 2 వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది. భారత జట్టు తరపున కేఎల్ రాహుల్ రాహుల్ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ 5 వికెట్లు పడగొట్టాడు.

అరంగేట్ర ఆటగాడు బెడింగ్‌హామ్‌ ఫిఫ్టీ, ఎల్గర్‌తో సెంచరీ భాగస్వామ్యం..

దక్షిణాఫ్రికా నుంచి అరంగేట్రం చేసిన డేవిడ్ బెడింగ్‌హామ్ అర్ధశతకం సాధించాడు. 113 పరుగుల వద్ద 3 వికెట్లు పడిపోవడంతో, బేడింగ్‌హామ్, డీన్ ఎల్గర్‌తో జతకలిశాడు. ఈ క్రమంలో ఎల్గర్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ ఒకరికొకరు సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా చేశారు. బెడింగ్‌హామ్ 80 బంతుల్లో తొలి యాభైని పూర్తి చేశాడు.

బెడింగ్‌హామ్ 56 పరుగుల వద్ద మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ వికెట్‌తో అతనికి, ఎల్గర్‌కు మధ్య 131 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌పడింది.

ఎల్గర్ 14వ టెస్టు సెంచరీ..

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సెంచరీ సాధించాడు. సహచర ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్ వికెట్ ప్రారంభంలోనే పడటంతో ఎల్గర్ జట్టు బాధ్యతలు స్వీకరించాడు. కొంత సమయం వేచి ఉన్న తర్వాత, అతను వేగంగా పరుగులు సాధించాడు. టోనీ డిజార్జ్‌తో కలిసి యాభై భాగస్వామ్యం చేశాడు. ఎల్గర్ 140 బంతుల్లో తన 14వ టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. ఎల్గర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో చివరి సిరీస్‌ను ఆడుతున్నాడు. అతను సిరీస్‌కు ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..