ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.188 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 49 బంతుల్లో 9 ఫోర్లతో 4 సిక్స్‌లతో 79 పరుగులు సాధించింది. ఆతర్వాత సూపర్ ఓవర్‌లోనూ 13 పరుగులు సాధించి భారత జట్టుకు గెలుపు బాట వేసింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్న స్మృతి మొదటి మ్యాచ్‌లోనూ 22 బంతుల్లో 28 పరుగులు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 100 కు పైగా పరుగులు సాధించిన ఈ టీమిండియా సెన్సేషన్ తాజాగా విడుదలైన ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. కెరీర్ బెస్ట్ 741 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. ఇక ఇదే సిరీస్‌లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్ తహీలా మెక్‌గ్రాత్.. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మొదటి మ్యాచ్‌లో 40 పరుగులు చేసిన మెక్‌గ్రాత్ రెండో మ్యాచ్‌లో 51 బంతుల్లోనే 70 రన్స్ సాధించింది. కాగా మెక్‌గ్రాత్ తన కెరీర్‌లో కేవలం 16 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి నెం1 ర్యాంక్‌ను కైవసం చేసుకోవడం విశేషం.
టాప్-10లో ముగ్గురు..
కాగా స్మృతితో సహా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ టాప్-10లో భారత నుంచి ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. ఆరో ర్యాంక్‌లో షెఫాలీ వర్మ, తొమ్మిదో ర్యాంక్‌లో రోడ్రిగ్స్ కొనసాగుతున్నారు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్టు చెరొక విజయం సాధించాయి. సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్ బుధవారం (డిసెంబర్ 14) జరగనుంది. ముంబై వేదికగా సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
A total team effort in front of a wonderful crowd. Can’t wait for the next one ? #INDvAUS pic.twitter.com/jP9UWFRZRX
— Smriti Mandhana (@mandhana_smriti) December 11, 2022