ఆసియా కప్‌లో టీమిండియా మెన్స్ జట్టు ఘోర పరాజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఉమెన్స్ టీం మాత్రం వరుస విజయాలతోపాటు ఏకంగా ఏడో సారి ట్రోపీని సొంతం చేసుకుంది. అయితే, ఇందులో శ్రీలంక టీం ఇరుజట్లకు కీలకంగా మారింది. అదేంటని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం.. మెన్స్ టీం కీలకమైన మ్యాచ్‌లో లంకతో ఓడిపోయింది. దీంతో టోర్నీ నుంచే తప్పుకుంది. ఇక ఉమెన్స్ టీం మాత్రం ఏ తప్పు చేయకుండా.. లంక టీంను ఓడించి చరిత్ర సృష్టించింది. అయితే, ఈవిజయంతో ప్రముఖంగా ఇద్దరి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. తొలుత బౌలింగ్‌లో రేణుకా సింగ్ సత్తా చాటగా, ఛేజింగ్‌లో మంధాన తన తుఫాన్ బ్యాటింగ్‌తో అలరించింది.
భారత మహిళల క్రికెట్ జట్టు ఏడోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ తరపున స్మృతి మంధాన 51 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్ల ముందు శ్రీలంక జట్టు పూర్తిగా విఫలమైంది దీంతో లంక జట్టు మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరపున రేణుకా సింగ్ 3 వికెట్లు పడగొట్టింది.
భారత జట్టు 20 ఓవర్లలో 66 పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, 8.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఈ స్కోరు సాధించింది. భారత్ తరపున స్మృతి మంధాన అద్భుత సెంచరీ చేసింది. 25 బంతుల్లో 51 పరుగులు చేసి, అత్యంత వేగంగా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లు చూపించిన దూకుడు ఓవైపు, మంధాన తుఫాన్ బ్యాటింగ్ మరోవైపు.. టీమిండియా ఫైనల్లో విజయం సాధించింది. విశేషమేమిటంటే, స్మృతి మంధాన అర్ధ సెంచరీకి 5 పరుగులు అవసరం కాగా, జట్టు విజయానికి 1 పరుగు మాత్రమే అవసరం. అయితే, మంధాన ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ముగించడం ద్వారా అద్భుతం చేసింది. ఈ క్రమంలో మంధాన కేవలం 25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు బాదేసింది. అలాగే 204 స్ట్రైక్ రేట్‌తో లంక బౌలర్లపై సత్తా చాటింది.
5️⃣1️⃣* (25) whilst chasing 66, just ??ℝ??? things! ??#OneFamily #INDvSL #AsiaCup2022 @BCCI @mandhana_smriti pic.twitter.com/HTI9UPWwir
— Mumbai Indians (@mipaltan) October 15, 2022
ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి శ్రీలంక జట్టును 20 ఓవర్లలో 9 వికెట్లకు 65 పరుగులకే పరిమితం చేశారు. భారత్ తరఫున రేణుకా సింగ్ మూడు వికెట్లు తీయగా, రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. అదే సమయంలో 66 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. దీంతో భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. భారత జట్టులో స్మృతి మంధాన 25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అర్ధ సెంచరీ చేసింది. శ్రీలంకను ఓడించి భారత్ ఏడోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
????. ?. ???! ? ?
Clinical performance from #TeamIndia as they beat Sri Lanka to win the #AsiaCup2022 title! ? ? #INDvSL
Scorecard ▶️ https://t.co/r5q0NTVLQC
? Courtesy: Asian Cricket Council pic.twitter.com/C61b4s1Hc2
— BCCI Women (@BCCIWomen) October 15, 2022
భారత బౌలర్ల అద్భుతం..
మహిళల ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రధాన బౌలర్ రేణుకా సింగ్ 3 ఓవర్లలో 5 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. దీంతో పాటు రాజేశ్వరి గయావాజాద్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. మరోవైపు స్నేహ రాణా 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది.