IPL 2022 Mega Auction: జహీర్ ఖాన్ ఇచ్చిన ఓ సలహా నా జీవితాన్నే మార్చింది: ఐపీఎల్ 2021 పర్పుల్ క్యాప్ బౌలర్
Zaheer Khan: ఐపీఎల్ 2021లో 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలబెట్టుకోలేదు.
Harshal Patel: ఐపీఎల్ 2021లో 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలబెట్టుకోలేదు. అంటే ప్రస్తుతం అతని పేరు IPL 2022 మెగా వేలంలో ఉండనుంది. ఆ వేలానికి ముందు హర్షల్ తన గురించి ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈమేరకు జహీర్ ఖాన్ నుంచి పొందిన చిట్కాతోనే ఇన్ని వికెట్లు దక్కాయంటూ పేర్కొన్నాడు. ఇది బౌలింగ్‌ను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపాడు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో హర్యానా ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఇలా అన్నాడు.. “నేను ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ముంబై ఇండియన్స్‌తో తలపడుతున్నప్పుడు నాకు జహీర్ భాయ్‌ని కలిసే అవకాశం వచ్చింది. బౌలింగ్‌లో లెగ్ స్టంప్‌పై డెలివరీ చేయడంలో నాకు సమస్య ఉంది. ఈ సమస్యతో నేను జహీర్ భాయ్‌ని సంప్రదించాను. నేను బంతిని విడుదల చేసే కోణంలో సమస్య ఉందని అతను చెప్పాడు. ఆ తరువాత నేను ఆఫ్-స్టంప్‌పై బంతిని పిచ్ చేస్తే, అది ఆటోమేటిక్‌గా లెగ్-స్టంప్ మీదుగా డ్రిఫ్ట్ అవుతుందని’ పేర్కొన్నాడు.
జహీర్ చెప్పినట్లే చేశా.. 43 ఏళ్ల జహీర్ ఖాన్ వివరించినట్లుగా, హర్యానా ఫాస్ట్ బౌలర్ అదే ప్రయత్నించాడు. హర్షల్ ప్రకారం, జహీర్ 6వ, 7వ స్టంప్‌లపై విడుదల చేసేందుకు యాంగిల్‌ను ఉంచాలని, తర్వాత ఆఫ్ స్టంప్‌ను కొట్టమని కోరాడు. జహీర్ ఇచ్చిన ఈ చిన్న సలహా బౌలర్‌గా తనను పూర్తిగా మార్చిందని హర్షల్ అంగీకరించాడు.
హర్షల్ పటేల్ 32 వికెట్లు తీసి ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో రికార్డును కూడా సమం చేశాడు. పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో అతని బౌలింగ్‌లో సామర్థ్యం ఉంది. ఇది కాకుండా కాపీ బాల్ హర్షల్ స్పెషాలిటీ. హర్షల్‌కు 63 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. అందులో అతను 78 వికెట్లు తీసుకున్నాడు. అతను ఆర్‌సీబీ నుంచి విడుదలైన తర్వాత, IPL 2022 కోసం మెగా వేలంలో హర్షల్ పటేల్‌పై కనక వర్షం కురుస్తుందని భావిస్తున్నారు. అతని కొత్త ఐపీఎల్ జీతం 40 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.