SL vs IND: శ్రీలంకతో మొదటి టీ20 .. టాస్ ఓడిన భారత్.. సంజూశామ్సన్ కు మళ్లీ నిరాశే

|

Jul 27, 2024 | 7:20 PM

భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టీ20 సిరీస్‌లో శుభారంభం చేయాని టీమిండియా భావిస్తోంది. శ్రీలంక కూడ ఇదే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ ముగియగా, టాస్ గెలిచిన లంక కెప్టెన్ చరిత్ అసలంక 

SL vs IND: శ్రీలంకతో మొదటి టీ20 .. టాస్ ఓడిన భారత్.. సంజూశామ్సన్ కు మళ్లీ నిరాశే
India Vs Srilanka
Follow us on

భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టీ20 సిరీస్‌లో శుభారంభం చేయాని టీమిండియా భావిస్తోంది. శ్రీలంక కూడ ఇదే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ ముగియగా, టాస్ గెలిచిన లంక కెప్టెన్ చరిత్ అసలంక   ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. కాగా ఇరు జట్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. జింబాబ్వే పర్యటనలో జట్టులో కనిపించిన కొంతమంది ఆటగాళ్లకు మొదటి మ్యాచ్‌లో అవకాశం లభించలేదు. వారిలో సంజు శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు. భారత్-శ్రీలంక మధ్య ఇప్పటి వరకు మొత్తం 29 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ జట్టు 19 మ్యాచ్‌లు గెలుపొందగా, శ్రీలంక జట్టు 9 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.

 

ఇవి కూడా చదవండి

రెండు జట్లు

టీమ్ ఇండియా:

శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, ర్యాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు:

అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, వనిందు హసరంగా, దసున్ షనక, కుసాల్ మెండిస్, దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), మతీష్ పతిరానా, మహేశ్ తిక్షన్, దునిత్ వెలలాగే, బినుర ఫెర్నాండో.

 

🚨 Toss and Playing XI 🚨#TeamIndia will bat first against Sri Lanka in the first T20I 🙌

Follow the Match ▶️ https://t.co/Ccm4ubmoxL#SLvIND pic.twitter.com/sUYeVyzZsE

— BCCI (@BCCI) July 27, 2024

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..