గాయం తర్వాత రీఎంట్రీ.. 52 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో బీభత్సం.. కివీస్ సిరీస్‌కు ముందే మాస్ వార్నింగ్..

India vs New Zealand ODI Series: న్యూజిలాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ వడోదరలో జరగనుంది. గణాంకాల ప్రకారం, న్యూజిలాండ్‌పై వన్డేల్లో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు జరిగిన 120 మ్యాచ్‌ల్లో భారత్ 62 సార్లు విజయం సాధించింది.

గాయం తర్వాత రీఎంట్రీ.. 52 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో బీభత్సం.. కివీస్ సిరీస్‌కు ముందే మాస్ వార్నింగ్..
Shreyas Iyer

Updated on: Jan 07, 2026 | 7:59 AM

Shreyas Iyer Comeback: భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి తన ఆత్మవిశ్వాసాన్ని, దూకుడును ప్రదర్శించాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. గాయం తర్వాత మైదానంలోకి దిగిన శ్రేయస్, తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశాడు. కేవలం 53 బంతులను ఎదుర్కొన్న ఈ స్టార్ బ్యాటర్, తన ప్రతిభను, సత్తాను చాటుకున్నాడు. ఆయన ఆడిన ఈ సంచలన ఇన్నింగ్స్, ఈ పునరాగమన మ్యాచ్‌ను అభిమానులకు ఒక చిరస్మరణీయ జ్ఞాపకంగా మార్చింది.

దేశవాళీ క్రికెట్‌లో శ్రేయస్ అయ్యర్ ధమకా ఎంట్రీ..

విజయ్ హజారే ట్రోఫీలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటం ద్వారా శ్రేయస్ అయ్యర్ పోటీ క్రికెట్‌లోకి ఘనంగా పునరాగమనం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రాకముందే ప్రత్యర్థులకు బలమైన సందేశాన్ని పంపాడు.

న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టులోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, అయ్యర్ తన మ్యాచ్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి ముంబై జట్టు తరపున బరిలోకి దిగాడు. ముంబై కెప్టెన్ అయిన శ్రేయస్ అభిమానులను నిరాశపరచలేదు. హిమాచల్ ప్రదేశ్‌పై 82 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన క్లాస్‌ను మరోసారి ప్రదర్శించారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మెడికల్ క్లియరెన్స్ పొంది, వన్డే జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత ఆయన ఆడిన మొదటి ఇన్నింగ్స్ ఇది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: డబ్బుల్లేక అలా చేశాడు గానీ..! లేదంటే పెద్ద క్రికెటర్ అయ్యేవాడు.. ఆ టాలీవుడ్ హీరో ఎవరంటే..?

గాయం నుంచి కోలుకుని న్యూజిలాండ్ సిరీస్ వైపు..

శ్రేయస్ అయ్యర్ మైదానంలోకి తిరిగి రావడం అంత సులభంగా జరగలేదు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆయన గాయపడ్డాడు. ఆ తర్వాత అంతర్గత రక్తస్రావం (internal bleeding) జరిగినట్లు తేలింది. గాయం తీవ్రత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఫలితంగా, కీలక సమయంలో భారత్ తన వైస్ కెప్టెన్ సేవలను కోల్పోయింది.

అయితే, నెలల తరబడి పునరావాసం (rehabilitation), రికవరీ తర్వాత, శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం జట్టులో చేరాడు. ఆయన మ్యాచ్‌లో పాల్గొనడం తుది మెడికల్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసినప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో ఆయన ప్రదర్శన ఆయనకు సానుకూలంగా మారింది.

హిమాచల్ ప్రదేశ్‌పై ముంబైకి విజయాన్ని అందించిన ఇన్నింగ్స్..

జైపురియా విద్యాలయ గ్రౌండ్‌లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ మృదుల్ ప్రవీణ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. యశస్వి జైస్వాల్ (21), సర్ఫరాజ్ ఖాన్ త్వరగానే అవుట్ అయ్యాడు.

ఇది కూడా చదవండి: IND vs NZ: తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్.. ప్లేయింగ్ 11లో షాకింగ్ మార్పు?

ఆ సమయంలో శ్రేయస్ అయ్యర్, ముషీర్ ఖాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముషీర్ ఖాన్ 73 పరుగులు చేసి విలువైన సహకారం అందించాడు.

శ్రేయస్ అయ్యర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నప్పటికీ, సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. కేవలం 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 154.72 స్ట్రైక్ రేట్‌తో 82 పరుగులు చేశాడు. ఆయన దూకుడు, సమన్వయంతో కూడిన ఇన్నింగ్స్ కారణంగా ముంబై నిర్ణీత ఓవర్లలో 299 పరుగుల భారీ స్కోరు సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..